https://oktelugu.com/

అమ్మాయిలకు శుభవార్త.. రూ.25,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

దేశంలోని చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలను ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల విద్యకు దూరమవుతున్న విద్యార్థినులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి విద్యార్థినులకు ఇంటర్న్ శాల అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటర్న్ శాల కెరియర్ స్కాలర్ ‏షిప్ ఫర్ గర్ల్స్ పేరుతో బాలికలకు 25,000 రూపాయల స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ఇంటర్న్ శాల సిద్ధమవుతోంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులు చేస్తే జాబ్ గ్యారంటీ..? ఇప్పటికే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2021 / 07:47 PM IST
    Follow us on


    దేశంలోని చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలను ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల విద్యకు దూరమవుతున్న విద్యార్థినులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి విద్యార్థినులకు ఇంటర్న్ శాల అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటర్న్ శాల కెరియర్ స్కాలర్ ‏షిప్ ఫర్ గర్ల్స్ పేరుతో బాలికలకు 25,000 రూపాయల స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ఇంటర్న్ శాల సిద్ధమవుతోంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులు చేస్తే జాబ్ గ్యారంటీ..?

    ఇప్పటికే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 15వ తేదిగా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://blog.internshala.com/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్..?

    స్టడీ, స్పోర్ట్స్, ఆటలు, ఇతర రంగాలకు చెందిన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థినుల వయస్సు, విద్యార్థినులు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, స్కాలర్ షిప్ పొందితే ఆ స్కాలర్ షిప్ ను ఎందుకు వినియోగిస్తారనే విషయాలకు సంబంధించి స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా వివరాలను తెలుసుకుని ఫారంలో రిఫరీని చేర్చుతారు. ఆ తరువాత వెరిఫికేషన్ ను పూర్తి చేసి అర్హులైన విద్యార్థినులకు స్కాలర్ షిప్ ను అందజేస్తారు.