https://oktelugu.com/

బిల్ గేట్స్ విడాకులకు అసలు కారణం అదేనట?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ 65 ఏళ్ల వయసులో తన భార్యతో విడాకులు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. 27 ఏళ్ల పాటు భార్య మిలిందాతో సంసారం చేసి ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ తో కోట్ల రూపాయలు వితరణ చేసిన ఈ అన్యోన్య జంట విడిపోవడం షాకింగ్ మారింది. అయితే అంత ప్రేమ ఉన్న వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న కారణం మాత్రం బయటకు రాలేదు. తాజాగా అది బయటకు వచ్చింది. మిలిందా కంటే ముందు బిల్ గేట్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2021 / 10:52 AM IST
    Follow us on

    ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ 65 ఏళ్ల వయసులో తన భార్యతో విడాకులు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. 27 ఏళ్ల పాటు భార్య మిలిందాతో సంసారం చేసి ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ తో కోట్ల రూపాయలు వితరణ చేసిన ఈ అన్యోన్య జంట విడిపోవడం షాకింగ్ మారింది. అయితే అంత ప్రేమ ఉన్న వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న కారణం మాత్రం బయటకు రాలేదు. తాజాగా అది బయటకు వచ్చింది.

    మిలిందా కంటే ముందు బిల్ గేట్స్ కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట.. ఆమె పేరు అన్ విన్ బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్ బ్లాడ్ తో డేటింగ్ చేశాడట.. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బిల్ కు మిలిందాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లి 1994లో వివాహంతో ఒక్కటయ్యారు.

    అయితే బిల్ గేట్స్ మాత్రం ఏడాదికి ఒకసారి తన మాజీ ప్రేయసి విన్ బ్లాడ్ ను కలిసే అవకాశం ఇవ్వాలని పెళ్లికి ముందే మిలిందాతో చెప్పాడట.. దానికి అమె సరే అనడంతో వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఏడాదికోసారి కలుసుకునేవారట.. ప్రతిఏటా నార్త్ కరోలినాలోని విన్ బ్లాడ్ కు చెందిన బీచ్ కాటేజ్ లో ఇద్దరూ కలుసుకునేవారని అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ ఐజాక్సన్ తెలిపారు. వారం పాటు సంతోషంగా గడిపేవారట.. బీచ్ లో తిరిగేవారట..

    అయితే ఇప్పుడు బిల్ గేట్స్-విన్ బ్లాడ్ మధ్య బంధం ఎక్కువ కావడంతో మిలిందా విడాకులు కోరిందని.. అందుకే విడిపోయారని అంటున్నారు. అయితే మిలిందాతో విడాకులకు అసలు కారణాలను మాత్రం బిల్ గేట్స్, మిలిందా ఇప్పటికీ చెప్పడం లేదు. బిల్ గేట్స్ ప్రియురాలి వల్లే వీరి పెళ్లి పెటాకులైందన్న వార్త మాత్రం సర్య్కూలేట్ అవుతోంది.