తెలుగు సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ అనే పదానికి ఇప్పటికీ ప్రతీకగా ‘ఎన్టీఆర్’ అనే చెబుతుంటారు ఇప్పటి తరం సినిమా వాళ్ళు కూడా. ఎన్టీఆర్ తెరమీద చంద్రబింబంలా కనిపించేవారు, దానికి కారణం ఆయన క్రమశిక్షణే. ఇప్పటి హీరోలూ మేకప్ కోసం గట్టిగా గంటసేపు కూర్చోలేరు. కానీ ఎన్టీఆర్ మేకప్ కోసం ఎంతసేపు అయినా ఓపిగ్గా ఉండేవారు. ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా మేకప్ ఉంటేనే, ఆయన పర్ఫెక్ట్ గా నటించేవారట.
మేకప్ అటు ఇటుగా ఉంటే ఆయన నటించడానికి కూడా వెళ్లేవారు కాదట. వాస్తవంగా ఎంత గొప్ప అందగాడు అయినా ‘క్లోజప్స్’ షాట్స్ లో బాగా కనిపించాలి అంటే, మేకప్ అతి కీలకం. అందుకే ఎన్టీఆర్ మేకప్ కు అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. అది ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమా తీస్తోన్న రోజులు, సహజంగా ఎన్టీఆర్ చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. తెల్లవారుజామునే మేకప్ వేసుకుని సెట్ కి వచ్చేవారు.
పైగా ఉదయం తొమ్మిది గంటలకే విత్ మేకప్ తో సెట్ కి రావడం అంటే.. ఇప్పటి హీరోలకే కాదు అప్పటి నటీనటులకు కూడా అసాధ్యం. ఆ సినిమాలో నటిస్తోన్న మొరళీమోహన్ కి కూడా. కానీ ఎన్టీఆర్ వచ్చిన తరువాత కూడా మిగిలిన నటీనటులు లేట్ చేస్తే బావుండదు కదా. అందుకే మిగిలిన అందరూ ఉదయం తొమ్మిది గంటలకు మేకప్ వేసుకుని సెట్ లో అడుగు పెట్టే వాళ్ళు. ఎన్టీఆర్ వచ్చేసరికి మేకప్ ఎలా ఉందో చెక్ చేసుకుని మరి రెడీగా ఎదురుచూస్తూ ఉండేవాళ్లు.
ఎన్టీఆర్ సెట్ లోకి వచ్చి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ అందరికీ ‘గుడ్ మార్నింగ్’ చెప్పేవారు. ఆ సమయంలో ఆయన వారి మేకప్ ను అబ్జర్వ్ చేసేవారట. ఎవరికైనా మేకప్ బాగా లేకపోయినా, వారి ఫేస్ ఫ్రెష్ గా లేకపోయినా వారికీ ప్రత్యేకంగా మళ్ళీ ‘హ్మ్.. గుడ్ మార్నింగ్ బ్రదర్. రండి..’ అని చెప్పి పక్కకు పిలిచేవారు.
అలా ఒకరోజు మురళీమోహన్ గారిని పిలిచి ఆయనను తన చైర్ పక్కనే కూర్చోబెట్టుకుని యాక్టర్ కి మేకప్ తో పాటు ఫేస్ లో ఫ్రెష్ నెస్ ఎంత ఇంపార్టెంటో సున్నితంగా కోప్పడుతూనే చెప్పారట. ఏది ఏమైనా అప్పటి నటీనటులకు క్రమశిక్షణ నేర్పి తెలుగు సినిమా రంగానికి గౌరవం తెచ్చిన హీరో అంటే ఒక్క ‘ఎన్టీఆరే’.