ఏపీలోని ఆ గ్రామంలో వింత మేకపిల్ల.. అచ్చం కోడిలా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వింత మేకపిల్ల పుట్టింది. సాధారణంగా మేకపిల్ల అంటే మేక ఆకారంలోనే ఉంటుంది. అయితే ఈ వింత మేకపిల్ల మాత్రం మేకలా కాకుండా కోడిలా ఉండటం గమనార్హం. ఈ వింత మేక పిల్ల గురించి తెలిసిన గ్రామస్తులు మేక పిల్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మేకపిల్లను తాము గతంలో ఎప్పుడూ చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత మేకపిల్ల బరువు కేవలం పావు కిలో కావడం గమనార్హం. Also Read: పెన్షనర్లే […]

Written By: Navya, Updated On : February 8, 2021 11:18 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వింత మేకపిల్ల పుట్టింది. సాధారణంగా మేకపిల్ల అంటే మేక ఆకారంలోనే ఉంటుంది. అయితే ఈ వింత మేకపిల్ల మాత్రం మేకలా కాకుండా కోడిలా ఉండటం గమనార్హం. ఈ వింత మేక పిల్ల గురించి తెలిసిన గ్రామస్తులు మేక పిల్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మేకపిల్లను తాము గతంలో ఎప్పుడూ చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత మేకపిల్ల బరువు కేవలం పావు కిలో కావడం గమనార్హం.

Also Read: పెన్షనర్లే వాళ్ల టార్గెట్.. డిపాజిట్ కాగానే లక్షల్లో లూటీ..?

పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌.కే దస్తగిరి మేకలను పెంచుకుని జీవనం
సాగించేవాడు. అతను పెంచుకుంటున్న మేకలలో ఒక మేక ఒకే ఈతలో రెండు మేకపిల్లలకు జన్మనివ్వగా రెండు మేకపిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి. అయితే అందులో ఒక మేకపిల్ల కేవలం 3 కిలోల బరువు ఉండగా రెండో మేకపిల్ల మాత్రం కేజిన్నర బరువు ఉంది.

Also Read: రైతులకు మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. ఏంటంటే..?

రెండు మేకపిల్లలకు జన్మనిచ్చిన మరుసటిరోజు మేక మరో మేకపిల్లకు జన్మనిచ్చింది. సాధారణ మేక పిల్లలా కాకుండా వింత ఆకారంలో ఉన్న ఈ మేకపిల్ల బరువు కేవలం 250 గ్రాములు కావడం గమనార్హం. ఈ మేకపిల్ల పుట్టిన కొంత సమయానికే మృతి చెందింది. ఈ మేకపిల్లకు ముక్కు కోడి మాదిరిగా ఉండటం గమనార్హం. ఈ మేకపిల్లను చూడటానికి గ్రామస్తులు ఎస్‌కే దస్తగిరి ఇంటికి వస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

తగినంత బరువు లేకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల జన్మించడం వల్లే మేకపిల్ల మృతి చెందినట్టు తెలుస్తోంది. మేకపిల్ల వింత ఆకారం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేయడం గమనార్హం.