
ఇంగ్లండ్ దేశాన్ని మరోసారి డెల్టా ప్లస్ వైరస్ కమ్మేస్తోంది. భారత జట్టు ఇంగ్లండ్ దేశంలో ఉన్న వేళ కరోనా కల్లోలం చోటుచేసుకుంది. ఇటీవల శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన అనంతరం ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లకు, నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వెంటనే ఇంగ్లండ్ టీం అంతటిని క్వారంటైన్ లో పెట్టారు.
ఇక పాకిస్తాన్ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ టీం ‘బెన్ స్టోక్స్ ’కెప్టెన్ గా కొత్త టీంను ప్రకటించారు. ఈ క్రమంలోనే భారత్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ కు సిద్ధమవ్వాలని ఇంగ్లండ్ టీం డిసైడ్ అయ్యింది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్2 సిరీస్ లో జరిగే తొలి పెద్ద సిరీస్ ఇంగ్లండ్-ఇండియా దే.. ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ ద్వారా ఈసీబీ దాదాపు 137 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించనుంది. మధ్యలో ఆటగాళ్లకు మరోసారి వైరస్ సోకితే సిరీస్ ను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే అందరు ఆటగాళ్లకు వెంటనే కరోనా టీకాలు వేయాలని డిసైడ్ అయ్యింది. రెండు జట్లకు రెండో డోసును సిరీస్ కు ముందే వేయించి సిరీస్ ను సాఫీగా సాగించాలని యోచిస్తోంది.
ఇండియాతో సిరీస్ కు కాసులు కురుస్తాయని ఇంగ్లండ్ భావిస్తోంది. అందుకే ఎక్కడా కరోనాతో చెడిపోకూడదని పకడ్బందీ చర్యలు చేపట్టింది.