https://oktelugu.com/

టీమిండియా యువ త్రయం.. అసీస్ కు చమటలు

సీనియర్ బౌలర్లు అశ్విన్, బుమ్రా లేకున్నా కూడా భారత్ క్రికెట్ జట్టు గొప్పగా ఆడింది. సత్తా చాటింది. ఎన్నో టెస్టులు ఆడి.. అద్భుత విజయాలు సాధించిన పెట్టి కీలక ఆటగాళ్లు అంతా గైర్హాజరీ అయిన వేళ కూడా టీమిండియా ఇంత గొప్పగా ఆడటాన్ని స్వయంగా ఆస్ట్రేలియా అభినందించడం విశేషం. Also Read: 4వ టెస్ట్: ఆస్ట్రేలియా 369 ఆలౌట్.. భారత్ నిలుస్తుందా? ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 16, 2021 / 07:43 PM IST
    Follow us on

    సీనియర్ బౌలర్లు అశ్విన్, బుమ్రా లేకున్నా కూడా భారత్ క్రికెట్ జట్టు గొప్పగా ఆడింది. సత్తా చాటింది. ఎన్నో టెస్టులు ఆడి.. అద్భుత విజయాలు సాధించిన పెట్టి కీలక ఆటగాళ్లు అంతా గైర్హాజరీ అయిన వేళ కూడా టీమిండియా ఇంత గొప్పగా ఆడటాన్ని స్వయంగా ఆస్ట్రేలియా అభినందించడం విశేషం.

    Also Read: 4వ టెస్ట్: ఆస్ట్రేలియా 369 ఆలౌట్.. భారత్ నిలుస్తుందా?

    ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. సుధీర్ఘ ఫార్మాట్ అనుభవం లేకపోయినా సరే టీమిండియా యువ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారని ఆండ్రూ కొనియాడారు.

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ లేకపోవడంతో తమకు లాభం అవుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆనందపడ్డారు. కానీ అశ్విన్ లేకున్నా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బంతిని గిరగిరా తిప్పుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన తీరుపై ప్రశంసలు కురిశాయి. యువ పేసర్ నటరాజన్ సైతం యార్కర్లతో విరుచుపడ్డాడు.

    చివరి టెస్టులో ఈ మ్యాచ్ లోనే అరంగేట్రం చేసిన సుందర్, నటరాజన్ ఇద్దరూ కూడా తమ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో వీరిద్దరూ చెరో మూడు వికెట్లు సాధించి సత్తా చాటారు.

    Also Read: 4వ టెస్ట్: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన భారత బౌలర్లు

    ఆస్ట్రేలియా రెండో రోజు మ్యాచ్ పై పట్టుబిగుస్తుందనే సమయంలో భారత యువ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ పై ఆసీస్ ఆశలను చిదిమేశారు. అయితే భారత కీలక ఓపెనర్లను ఔట్ చేయడం సంతోషాన్నిచ్చిందని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ అన్నాడు.

    టీమిండియా ఈ టెస్టులో నిలదొక్కుకోవాలంటే ఇంకా 307 పరుగులు చేయాలి.. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరి మూడో రోజు కీలకం కానుంది.