https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాలను వదలని కేంద్రం.. మళ్లీ ఏం చేసిందంటే?

పిల్లిపిల్లిపోరు పిట్ట తీర్చింది అన్నట్టుగా ఇప్పుడు నీళ్ల కోసం కొట్టుకుంటున్న తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణ నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తోంది. Also Read: అగమ్యగోచరం: ‘గంటా’ దారెటు? తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే సమర్పించాలని కేంద్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2021 10:38 am
    Follow us on

    CM JAGAN CM KCR

    పిల్లిపిల్లిపోరు పిట్ట తీర్చింది అన్నట్టుగా ఇప్పుడు నీళ్ల కోసం కొట్టుకుంటున్న తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణ నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తోంది.

    Also Read: అగమ్యగోచరం: ‘గంటా’ దారెటు?

    తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే సమర్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ఉభయ రాష్ట్రాల సీఎంను కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, జగన్ లు ఇద్దరికీ షేకావత్ లేఖలు రాశారు.

    గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్ లు అందివ్వాలని లేఖలో కోరారు. తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి షేకావత్ తెలిపారు. కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్ లు తెలంగాణ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్ రాలేదన్నారు.

    Also Read: మోడీ వ్యాక్సిన్.. డప్పు కొట్టుకుంటున్న జగన్

    ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైతం డీపీఆర్ ఇవ్వాలని ఆదేశించారు. పట్టిసీమ 3వ దశ, కృష్ణాపై 13, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని దీనిపై డీపీఆర్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

    ఇలా రెండు తెలుగు రాష్ట్రాల పంచాయితీపై కేంద్రం జోక్యం చేసుకొని ఇప్పుడు ప్రాజెక్టులపై పెత్తనం.. అవి కట్టకుండా డీపీఆర్ లను కేంద్రం అడుగుతూ ఇరు రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ చర్చలతో సమస్య పరిష్కరించుకుంటే ఇప్పుడు ఈ కేంద్రం జోక్యం ఉండేదే కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్