‘తలైవా’ ఇంటి ముందు టెన్షన్.. టెన్షన్..!

కొత్త ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కొద్దిరోజుల నుంచి అక్కడి రాజకీయాలు హీటెక్కాయి. ఇదేక్రమంలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరగేట్రంపై హైడ్రామా కొనసాగుతోంది. Also Read: అదిరిందయ్యా ‘చంద్రం’.. కొత్త ఏడాదిలో కొత్త సెకట్రేరియట్..! కొద్దిరోజులుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం తమిళనాడులో జోరుగా జరిగింది. రజనీ సైతం డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీని ప్రకటిస్తానని వెల్లడించాడు. అయితే అనుకోనివిధంగా రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ కు షూటింగ్ కోసం […]

Written By: Neelambaram, Updated On : January 1, 2021 5:53 pm
Follow us on

కొత్త ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కొద్దిరోజుల నుంచి అక్కడి రాజకీయాలు హీటెక్కాయి. ఇదేక్రమంలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరగేట్రంపై హైడ్రామా కొనసాగుతోంది.

Also Read: అదిరిందయ్యా ‘చంద్రం’.. కొత్త ఏడాదిలో కొత్త సెకట్రేరియట్..!

కొద్దిరోజులుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం తమిళనాడులో జోరుగా జరిగింది. రజనీ సైతం డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీని ప్రకటిస్తానని వెల్లడించాడు. అయితే అనుకోనివిధంగా రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడు.

హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చిన రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాడు. 48గంటలు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాడు. అనంతరం వైద్యులు రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

రజనీ ఆరోగ్యంపై అభిమానులు.. సినీ ప్రముఖులు.. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే రజనీపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. తనను అభిమానులు మన్నించాలని కోరాడు.

Also Read: న్యూ ఇయర్ కు ఘన స్వాగతం.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

రజనీకాంత్ ప్రకటనపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. కొందరు రజనీ దిష్టిబొమ్మలను తగులబెడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ ఇంటి ముందు మురుగేషన్ అనే అభిమాని ఆత్మహత్యకు పాల్పడటం శోచనీయంగా మారింది. ఆత్మహత్యాయత్నానికి ముందు రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు తెలుస్తోంది.

తీవ్ర గాయాలపాలైన మురుగేషన్ ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరో 24గంటలు గడిస్తేగానీ అతడి పరిస్థితిని చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్