4వ టెస్టులో టీమిండియా ఘనవిజయం.. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్

4వ టెస్టులో మూడో రోజే ఇంగ్లండ్ చాపచుట్టేసింది. ఏకంగా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఒక ఇన్నింగ్స్ భారత్ చేయకుండానే విజయం సాధించడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ కూడా తొలుత తడబడింది. అయితే వికెట్ కీపర్ పంత్ 101, వాషింగ్టన్ సుందర్ 96 పరుగుల వీరోచిత బ్యాటింగ్ తో టీమిండియా […]

Written By: NARESH, Updated On : March 6, 2021 4:05 pm
Follow us on

4వ టెస్టులో మూడో రోజే ఇంగ్లండ్ చాపచుట్టేసింది. ఏకంగా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఒక ఇన్నింగ్స్ భారత్ చేయకుండానే విజయం సాధించడం విశేషం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ కూడా తొలుత తడబడింది. అయితే వికెట్ కీపర్ పంత్ 101, వాషింగ్టన్ సుందర్ 96 పరుగుల వీరోచిత బ్యాటింగ్ తో టీమిండియా 365 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.

ఇక 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లోనూ అక్షర్ పటేల్ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ భారీ విజయాన్ని సాధించింది.

భారత్ విజయానికి ప్రధాన కారణం పంత్, సుందర్ లు చేసిన సెంచరీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యం కూడా ఆ జట్టు ఓటమికి కారణమైంది.