https://oktelugu.com/

ముసలాడిగా రవితేజ.. మళ్ళీ ప్రేమ కథ కూడా !

మాస్ మహారాజ్ రవితేజ తన వరుస పరాజయాల పరంపరను ‘క్రాక్’ సినిమాతో ఎట్టకేలకు అడ్డుకుని మొత్తానికి భారీ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమాని దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. పైగా అదీ తండ్రీకొడుకులుగా. అన్నట్టు సినిమా కథ ఎక్కువుగా ముసలి రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందని.. ముసలాడు అయినప్పటికీ ఒక పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడని, అక్కడి నుండి కథ ఎన్ని […]

Written By:
  • admin
  • , Updated On : March 6, 2021 / 04:15 PM IST
    Follow us on


    మాస్ మహారాజ్ రవితేజ తన వరుస పరాజయాల పరంపరను ‘క్రాక్’ సినిమాతో ఎట్టకేలకు అడ్డుకుని మొత్తానికి భారీ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమాని దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. పైగా అదీ తండ్రీకొడుకులుగా. అన్నట్టు సినిమా కథ ఎక్కువుగా ముసలి రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందని.. ముసలాడు అయినప్పటికీ ఒక పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడని, అక్కడి నుండి కథ ఎన్ని మలుపులు తిరిగింది ? చివరకు ముసలాడి కథకు ఎలాంటి ముగింపు దక్కింది అనేది మెయిన్ ప్లాట్ అట.

    Also Read: రామ్-లింగుస్వామి చిత్రంలో ‘ఉప్పెన’ బ్యూటీ.. మరో క్రేజీ ఆఫర్

    మరి ఈ సినిమాలో రవితేజది డబుల్ రోల్ కాబట్టి ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారు. ఆ ఇద్దరి హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి అనే కొత్త భామ, అలాగే మరో హీరోయిన్ గా ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసిన డింపుల్ హయతిను తీసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాకపోతే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈ సినిమాలో డింపుల్ హయతి నటిస్తోంది. ఇప్పటికే ఆమె షూట్ లో కూడా పాల్గొంది. అన్నట్టు ఆమె పాత్ర కాస్త బోల్డ్ గా ఉండనుంది. సినిమాలో ఫుల్ గా ఎక్స్ పోజింగ్ కి కూడా రెడీ అయింది డింపుల్.

    Also Read: మహా సముద్రం ఫస్ట్ లుక్: క్రూరంగా కనిపిస్తున్న శర్వానంద్

    మరి చూడాలి, ఈ భామ ఏ రేంజ్ గ్లామర్ ను చూపిస్తోందో. రవితేజ క్రాక్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కాబట్టి ఇప్పుడు చేస్తోన్న ఖిలాడీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే రమేష్ వర్మ సినిమాలో ఫుల్లుగా గ్లామర్ ని నింపే ప్రయత్నం చేసున్నాడు. పైగా ఖిలాడి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అనసూయ కూడా జాయిన్ అయింది ఈ సినిమాలో. అనసూయది కూడా కీలక పాత్ర అట. విలన్ ప్రియురాలిగా ఆమె కనిపిస్తోందని.. బాగా సెక్సీగా ఆమె నటించబోతుందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్