అడ్డంగా నిలబడ్డ శార్ధూల్, వాషింగ్టన్.. ఆస్ట్రేలియాతో టెస్ట్ రసవత్తరం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా స్కోరుకు ధీటుగా భారత్ బదులిచ్చింది. ఇద్దరు భారత బౌలర్లు బ్యాట్స్ మెన్లుగా మారి ఆస్ట్రేలియాకు అడ్డంగా నిలబడ్డారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 336 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వాషింగ్టన్ సుందర్ 62, శార్ధుల్ ఠాకూర్ 67 పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. Also Read: టీమిండియా యువ త్రయం.. అసీస్ […]

Written By: NARESH, Updated On : January 17, 2021 4:29 pm
Follow us on

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా స్కోరుకు ధీటుగా భారత్ బదులిచ్చింది. ఇద్దరు భారత బౌలర్లు బ్యాట్స్ మెన్లుగా మారి ఆస్ట్రేలియాకు అడ్డంగా నిలబడ్డారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 336 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వాషింగ్టన్ సుందర్ 62, శార్ధుల్ ఠాకూర్ 67 పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

Also Read: టీమిండియా యువ త్రయం.. అసీస్ కు చమటలు

ప్రధాన భారత బ్యాట్స్ మెన్ పెద్ద స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలగా ఆడారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీం ఇండియా తరుఫున ఏడో వికెట్ కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం కేవలం 33 పరుగులకే పరిమితమైంది. హేజిల్ వుడ్ 5 వికెట్లు, స్టార్క్ 2, కమిన్స్ 2 , లైయన్ 1 వికెట్ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 20, మార్కస్ హారిస్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పూజారా 25, రహానే 37, పంత్ 23 నిలకడగా ఆడినా భోజన విరామం ముందు భారత్ నాలుగో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 38, పంత్ సైతం జాగ్రత్తగా ఆడి తొలి సెషన్ పూర్తి చేశారు. 161/4 నిలిచింది. అయితే పంత్, మయాంక్ అవుట్ కావడంతో భారత్ 16/6 స్కోరుతో కష్టాల్లో పడింది. టెయిలెండర్లే కావడంతో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగింది.

Also Read: 4వ టెస్ట్: ఆస్ట్రేలియా 369 ఆలౌట్.. భారత్ నిలుస్తుందా?

అయితే బౌలర్లే అయినా కూడా శార్ధూల్, సుందర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ అర్థశతకాలతో ఏడో వికెట్ కు ఏకంగా 100 పరుగులకు పైగా జోడించి భారత్ కు భారీ స్కోరును అందించారు. అయితే చివరకు వీరంతా ఔట్ కావడంతో టీమిండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది.