
మెటర్నటీ లీవులు అందరికీ తెలిసిందే.. గర్భంతో ఉన్న పనిచేస్తున్న మహిళలు.. బిడ్డను కనేందుకు కనీసం మూడు నెలల పాటు ఈ లీవు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ‘పితృత్వ సెలవు’ అనేది కొత్తగా వచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలువులు తీసుకొని భార్య డెలివరీకి భారత్ కు వచ్చేశాడు. ఇప్పుడు ఇదే క్రమంలో టీడీపీ ఎంపీ కూడా ‘పితృత్వ సెలవుల’ కోసం పార్లమెంట్ స్పీకర్ కు లేఖ రాయడం వైరల్ అయ్యింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓ గమ్మత్తైన లేఖ రాశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. తనకు 10 రోజుల పాటు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాశాడు టీడీపీ ఎంపీ.
గర్భిణులకు ప్రసూతి సెలవులు ఇచ్చినట్టే తనకు పితృత్వ సెలవులు ఇవ్వాలంటూ స్పీకర్ కు రాసిన లేఖలో రామ్మోహన్ కోరడం విశేషం. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం.
ఒక బాధ్యతాయుతమైన భర్తగా.. తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నానని.. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు తొమ్మిది రోజుల పాటు సెలవు మంజూరు చేయాలని కింజారపు కోరారు. వచ్చేవారం తన భార్య బిడ్డకు జన్మనివ్వనుందని.. ఇలాంటి పరిస్థితుల్లో తన వెంట ఉండాలని కోరుకుంటున్నానంటూ ఎంపీ రామ్మోహన్.. స్పీకర్ కు లేఖలో వివరించారు.తన భార్య శ్రావ్య రాబోయే వారంలో ఎప్పుడైనా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఆమెకు తోడుండాలని కోరుకుంటున్నట్టు రామ్మోమన్ నాయుడు వివరించారు.