చైనాలో సోకిన కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇప్పటివరకు 30పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఇందులో కొంతమంది రికవరీ అయ్యారు. కేరళలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. అలాగే తెలంగాణ ఒక కరోనా కేసు నమోదుకాగా ఆ వ్యక్తి పూర్తిగా రికవరీ కావడంతో తెలంగాణలో కొంత ఊరట కలిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.
తాజాగా ఏపీలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని నెల్లూరు జిల్లా వాసిసి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇటలీలో నివాసం ఉండే ఈ యువకుడు 14రోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఢిల్లీ, చైన్నె విమానశ్రయాల్లో యువకుడికి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాలేదు.
తాజాగా ఈ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యక్తి శాంపిల్స్ ఫుణే ల్యాబ్ కు పంపారు. బుధవారం సాయంత్రం నాటికి ఈ వ్యక్తికి కరోనా సోకింది.. లేనిది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే ఏపీలో ఇదే తొలిసారి కరోనా కేసు అవుతుంది. కరోనా సోకిందనే సమాచారంలో ఏపీలో భయాందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.