https://oktelugu.com/

సర్వే సంచలనం: పశ్చిమ బెంగాల్ లో గెలుపెవరిదంటే?

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ సై అంటే సై అంటోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎలాగైనా సరే ఓడించాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. ఇరు పక్షాలు దీనిపై హోరాహోరీగా తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బీజేపీ పాగా వేయడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టించిన కమలం నాయకులు అధికారం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2021 / 09:12 PM IST
    Follow us on

    పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ సై అంటే సై అంటోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎలాగైనా సరే ఓడించాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. ఇరు పక్షాలు దీనిపై హోరాహోరీగా తలపడుతున్నాయి.

    తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బీజేపీ పాగా వేయడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టించిన కమలం నాయకులు అధికారం దిశగా పావులు కదుపుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి హిందూ నినాదాన్ని వాడుకుంటున్నారు. హిందూ నినాదాలతో మా ప్రజలను ఆకట్టుకోలేరని, మేం కూడా హిందువులమేనని తృణమూల్ కార్యకర్తలు తిప్పికొడుతున్నారు.

    పశ్చిమ బెంగాల్ లో హిందు నినాదంతో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రంలో 28 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారిని బుజ్జగించడం కోసమే హిందుత్వ నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమత తప్పు పడుతోందని తెలుస్తోంది.

    ఇప్పటికే అధికార టీఎంసీ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వలసలు పెరిగాయి. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. మరోవైపు కాంగ్రెస్-వామపక్షాలు కూటమిగా ఏర్పడి ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి.

    వరుసగా రెండు సార్లు గెలిచిన మమతా బెనర్జీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రంలో ఎవరిది అధికారం అని ‘సీఎన్ఎక్స్-ఏబీపీ ఆనంద’ అనే సంస్థలు సర్వే నిర్వహించాయి. గత నెల 23 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ సర్వే చేశాయి. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

    అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 146-156 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఇక బీజేపీకి 113-121 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. ఇక కాంగ్రెస్-వామపక్షాలకు 20-28 స్థానాలు రావచ్చని తేలింది.

    బెంగాల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ మార్క్ 148 సీట్లు. అంటే మమతా బెనర్జీ అధికారానికి దగ్గరలో ఉన్నట్టు అర్థమవుతోంది. మరి ఈ సర్వే నిజమవుతుందా? లేదా అన్నది చూడాలి. సీట్లు తక్కువైనా కాంగ్రెస్-వామపక్షాలు మమతా బెనర్జీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.