https://oktelugu.com/

లాయర్ల హత్య కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్.. బండి సంజయ్ సంచలన ఆరోపణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో సంచలన ఆరోపణ చేశారు. తాజాగా పెద్ద పల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ఈ హత్యల ద్వారా మంథని ప్రాంత టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. లాయర్ దంపతుల హత్యపై కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హత్యకు గురైన లాయర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2021 / 08:32 PM IST
    Follow us on

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో సంచలన ఆరోపణ చేశారు. తాజాగా పెద్ద పల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ఈ హత్యల ద్వారా మంథని ప్రాంత టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు.

    లాయర్ దంపతుల హత్యపై కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హత్యకు గురైన లాయర్ దంపతులు నిజాయతీతో పనిచేసే వారని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేస్తూ పేదల తరుఫున పోరాడుతున్నారని ఆయన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని వామనరావు గతంలో హైకోర్టును ఆశ్రయించారని.. కానీ ప్రభుత్వం రక్షణ కల్పించకుండా హత్య చేయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    హైకోర్టు ఆదేశించినా.. భద్రత కల్పించలేదని.. ఎవరి తప్పో కేసీఆర్ చెప్పాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు. ఈ హత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి అనేకమంది ప్రముఖుల చిట్టా వామనరావు దగ్గర ఉందని.. వాటిని మాయం చేయడం కుదరకపోవడంతో మనిషినే మాయం చేశారని ఆరోపించారు. ఈ హత్యల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.

    ప్రభుత్వం పెద్దలు, కొందరు పోలీసు అధికారులు తప్పు చేసినందునే న్యాయపరంగా ఎదుర్కోలేక అడ్వొకేట్ దంపతులను హతమార్చారని బండి సంజయ్ ఆరోపించారు. మహిళా అడ్వొకేట్ ను హత్య చేయడం ఇంతకు ముందెప్పుడు చూడలేదని బండి సంజయ్ ఆరోపించారు.