https://oktelugu.com/

అబ్బా.. ఏం చెప్తిరి.. అన్యాయాలపై సరెండరేనా?

పత్రికలన్నాక.. ప్రజాపక్షం వహించాలి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గొంతెత్తి చాటాలి.ప్రతిపక్షాల గొంతుక కావాలి. అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలి. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఎప్పుడైతే రియల్ జర్నలిస్టులు కనుమరుగై రాజకీయ పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పత్రికల విలువలు గంగలో కలిసిపోయాయన్న చర్చ మీడియా సర్కిల్స్ లో ఉంది. అందుకే ఇప్పుడు విలువలు లేవు.. పలువులు.. లేవు.. అధికార పక్షానికి దాసోహం కావడమే వారి కర్తవ్యంగా కనిపిస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 09:25 AM IST

    kcr media telangana

    Follow us on


    పత్రికలన్నాక.. ప్రజాపక్షం వహించాలి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గొంతెత్తి చాటాలి.ప్రతిపక్షాల గొంతుక కావాలి. అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలి. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఎప్పుడైతే రియల్ జర్నలిస్టులు కనుమరుగై రాజకీయ పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పత్రికల విలువలు గంగలో కలిసిపోయాయన్న చర్చ మీడియా సర్కిల్స్ లో ఉంది. అందుకే ఇప్పుడు విలువలు లేవు.. పలువులు.. లేవు.. అధికార పక్షానికి దాసోహం కావడమే వారి కర్తవ్యంగా కనిపిస్తోంది. అంతకుమించి ముందుకెళితే పత్రికలు, మీడియాకు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు పాలకులు.

    Also Read: తెరాస -మజ్లిస్ వైరం నిజమా ? కొత్త నాటకమా?

    అందుకే మీడియా ధీటైన జర్నలిస్టుల చేతుల్లోనే  ఉండాలి. వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు మీడియాలోకి ప్రవేశించారో వారి ప్రయోజనాల కోసం పాలకులకు అమ్ముడు పోతున్నారన్న ఆరోపణలున్నాయి..

    తెలంగాణలో ఇప్పుడు మీడియా అంతా కేసీఆర్ కు దాసోహం అయ్యిందనే చర్చ సాగుతోంది. ఒకటి అరా గొంతెత్తుతున్నా వాటి బలం సరిపోవడం లేదు. ప్రధాన మీడియా అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందన్న విమర్శ ఉంది. ఇక ప్రతిపక్షానికి చెందిన మీడియాను కేసీఆర్ సామధానబేధ దండోపాయాలు ఉపయోగించి కట్టడి చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో మీడియా చచ్చుబడిపోయిందన్న ఆవేదన రియల్ జర్నలిస్టుల్లో ఉంది. అన్యాయాలపై అధికార పక్షానికి సరెండరై అయిపోయారనే అపవాదును తెచ్చుకుంది.

    నిజానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం అద్భుతమైనది.. అందరూ అభినందించాల్సిందే. కానీ పాలకుల మంచి పనని హైలెట్ చేస్తున్న పత్రికలు.. మీడియా వారి తప్పు ఒప్పులను మాత్రం కప్పేస్తున్నాయన్న ఆవేదన జర్నలిస్టులు ప్రజల్లో ఉంది.

    Also Read: రూ.300 కోట్లు టు రూ.1200 కోట్లు.. కేసీఆర్ ఆడింది ఆట?

    తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై ఎలుగెత్తి చాటడం లేదు. కరోనా తీవ్రతను చూపించడం లేదు. కేసీఆర్ సచివాలయానికి కోట్లు పెడుతున్న రాయడం లేదు. ఇక ఎన్నో ఉపద్రవాలు చోటుచేసుకున్నా పత్రికల్లో మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం లేదు.కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఒక్క మంచి చేయగానే ఆయన తరుఫున ఎప్పుడూ రాని కలం రంగులేసి మరీ ఇలా కేసీఆర్ ను హీరోలా చూపించడం పలువురు జీర్ణించుకోవడం లేదు.

    మంచి చేసినప్పుడే కాదు.. కేసీఆర్ తప్పులను కూడా ఇలానే ఎత్తిచూపితేనే.. అది మీడియా అంటారని.. ప్రజాపక్షంగా మీడియా పనిచేయాలని పలువురు కోరుతున్నారు..

    -ఎన్నం