నాటి డమ్మీ నేతలే.. నేడు హీరోలు..

‘బండ్లు ఓడలు కావచ్చు.. ఓడలు బండ్లు కావచ్చు’ అన్నట్లు తయారైంది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. ఒకప్పుడు గళం విప్పని నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రెస్‌మీట్లో చివరి బెంచీన కూర్చున్న పలువురు.. ఇప్పుడు మైక్‌పట్టి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని టీడీపీలో ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంది. Also Read: ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపు పార్టీలోని బచ్చుల అర్జునుడు, బుద్దాం వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌లకు గతంలో పార్టీలో కానీ.. బయట కానీ పెద్దగా […]

Written By: NARESH, Updated On : September 11, 2020 10:15 am

Three crore offer to Mla to keep the party unchanged

Follow us on

‘బండ్లు ఓడలు కావచ్చు.. ఓడలు బండ్లు కావచ్చు’ అన్నట్లు తయారైంది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. ఒకప్పుడు గళం విప్పని నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రెస్‌మీట్లో చివరి బెంచీన కూర్చున్న పలువురు.. ఇప్పుడు మైక్‌పట్టి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని టీడీపీలో ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంది.

Also Read: ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపు

పార్టీలోని బచ్చుల అర్జునుడు, బుద్దాం వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌లకు గతంలో పార్టీలో కానీ.. బయట కానీ పెద్దగా ప్రాముఖ్యత లేదు. వీరంతా ఒకప్పుడు చంద్రబాబు ముఖం చూడాలన్నా రోజుల తరబడి వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. అందరితో పాటే క్యూ కట్టాల్సి వచ్చేది. బుద్దా వెంకన్న వంటి వారితై ఏకంగా పార్టీ ముఖ్యులతో రెకమండ్‌ చేయించుకునే వారట. అయితే.. వెంకన్నకు ఎమ్మెల్సీ రావడానికి కూడా నాటి కొందరు సీనియర్‌‌ నేతలకు నచ్చలేదు. ఎన్నో కష్టాలు పడి ఎమ్మెల్సీ సీటు అయితే సంపాదించుకున్నారు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు కదా. అందుకే మారిన రాజకీయ పరిస్థితులు వారిని నిలబెట్టాయి. రోజురోజుకూ పార్టీ ప్రతిష్ట దిగజారుతుండడం, ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు జిల్లాలో పార్టీ పరిస్థితి తీసికట్టులా మారింది.

అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరినైతే నమ్మారో.. వారు పార్టీని వీడిపోయారు. మరికొందరు గ్రూపులు కట్టారు. దీంతో కృష్ణా జిల్లాలో పార్టీని నడిపించే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, విజయవాడ టీడీపీ ఇన్‌చార్జిగా బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ రాజేంద్ర ఎప్పుడైతే నియామకం అయ్యారో ఇప్పుడు వారే గళం విప్పుతున్నారు. ప్రభుత్వంపై అస్త్రశస్త్రాలు సంధిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మీడియా ముందుకొస్తున్నారు.. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.

Also Read: బ్రేకింగ్: అంతర్వేది రథం దగ్ధంపై జగన్ షాకింగ్ నిర్ణయం

అంతేకాదు.. అధినేత చంద్రబాబు కూడా వీరిని ప్రోత్సహిస్తుండ‌డంతో బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదిగేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే.. వీరు ఏ మేర‌కు పుంజుకుంటారు? ఏ మేర‌కు పార్టీని నిల‌బెడ‌తార‌నేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్‌.  వీరిలో ఓ నాయకుడు మాత్రం ‘ఇప్పుడు మేము ఎంత కష్టపడినా రేపు పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వెనక బెంచీలోకి పోవాల్సిందే’నని అంటున్నట్లు సమాచారం. అప్పుడు మళ్లీ ఇన్నాళ్లు సైలైంట్‌గా ఉండిపోయిన లీడర్లే పెత్తనం చెలాయిస్తారని అభిప్రాయపడుతున్నాడంట.