కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఉజ్వల స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు గ్యాస్ కనెక్షన్ ను తీసుకుంటే రూ.1,600 పొందవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ లో కోటి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read: వాహనదారులకు శుభవార్త.. టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్..?
ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసిన వాళ్లకు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ కొరకు అయ్యే ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇచ్చే 1,600 రూపాయలతో గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలు ఉజ్వల స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఉజ్వల వెబ్ సైట్ నుంచి ఈ స్కీమ్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read: కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే కొత్తకారుపై డిస్కౌంట్..!
కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ను కచ్చితంగా కలిగి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా 5 కేజీల సిలిండర్ లేదా 14 కేజీల సిలిండర్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సమీపంలోని గ్యాస్ సిలిండర్ ఏజెన్సీని సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇది వరకు గ్యాస్ కనెక్షన్ ను కలిగి ఉండకపోతే మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.