https://oktelugu.com/

రజనీని టార్గెట్ చేసిన స్టాలీన్.. అప్పుడే సెగ మొదలైందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించాడో లేదో అప్పుడే ఇతర పార్టీలు ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నాయి. తాజాగా డీఎంకె అధినేత స్టాలీన్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ఎప్పుడూ అధికార మార్పిడి జరిగిన అన్నాడీఎంకే.. డీఎంకే పార్టీల మధ్యే ఉంటుంది. కొన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 03:29 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.

    రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించాడో లేదో అప్పుడే ఇతర పార్టీలు ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నాయి. తాజాగా డీఎంకె అధినేత స్టాలీన్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

    తమిళనాడులో ఎప్పుడూ అధికార మార్పిడి జరిగిన అన్నాడీఎంకే.. డీఎంకే పార్టీల మధ్యే ఉంటుంది. కొన్ని దశాబ్దలుగా ఈ రెండు పార్టీలే తమిళనాడును శాసిస్తూ వస్తున్నాయి.కాగా ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉంది.

    రాబోయే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని స్టాలీన్ కలలు కంటున్నాడు. అయితే రాబోయే ఎన్నికల్లో కొత్త పార్టీతో రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వనుండటం డీఎంకేకు శరఘాతంగా మారబోతుంది. దీంతో స్టాలీన్ రజనీకాంత్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది.

    తమిళనాడులో కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన డీఎంకే గెలుపు ఖాయమని స్టాలీన్ అన్నారు. డీఎంకేను ఎదుర్కొనే దమ్ములేక కొన్ని శక్తులు కొందరితో కొత్త పార్టీలను బలవంతంగా ఏర్పాటు చేస్తున్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు.

    ఎన్ని పార్టీలు కొత్తగా వచ్చినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ ఎన్నికల నగారా మోగించారు. తాను కూడా జనవరి మొదటి వారం నుంచి ప్రచారం మొదలు పెడుతానంటూ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

    రాబోయే ఎన్నికల్లో డీఎంకే 200 సీట్లను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇందుకోసం కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని స్టాలీన్ కోరారు. ప్రతీ ఊరిలో గ్రామసభలు ఏర్పాటుచేసి శ్రేణులంతా ప్రచారం చేయాలని సూచించాడు.