https://oktelugu.com/

సీనియార్టీ కాదు.. పార్టీని బతికించే వాడే కావాలి..!

తెలంగాణగా ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు ఉంది. అయితే దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేక కాంగ్రెస్ నాయకులు రెండుసార్లు చేజేతులు అధికారాన్ని టీఆర్ఎస్ కు అప్పగించారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధ్వానస్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రంలో మాత్రం గల్లీస్థాయికి పడిపోయింది. ఒకప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్లో చక్రం తిప్పిన కాంగ్రెస్.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 02:48 PM IST
    Follow us on

    తెలంగాణగా ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు ఉంది. అయితే దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేక కాంగ్రెస్ నాయకులు రెండుసార్లు చేజేతులు అధికారాన్ని టీఆర్ఎస్ కు అప్పగించారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధ్వానస్థితికి తీసుకొచ్చారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రంలో మాత్రం గల్లీస్థాయికి పడిపోయింది. ఒకప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్లో చక్రం తిప్పిన కాంగ్రెస్.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమవడాన్ని ఆపార్టీ శ్రేణులే జీర్ణించుకోలేక పోతున్నాయి.

    తెలంగాణలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న జిల్లాల్లోనూ ఇటీవలీ కాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీనంతటికీ కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు, సీనియర్లే కారణమని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా చెప్పుకుంటూ కొందరు పార్టీని అధోగతి పట్టిస్తున్నట్లు అధిష్టానం గుర్తించినట్లు కన్పిస్తోంది.

    దీంతోనే కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ప్రకటనకు ముందు అన్ని జిల్లాల నేతల అభిప్రాయాలను సేకరించింది.ఈ నివేదిక ఆధారంగా పీసీసీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం సీనియారిటీని పక్కనపెట్టి పార్టీని ఎవరైతే సరైన రీతిలో నడిపించగలరో వారికే పీసీసీ కట్టబెట్టాలని భావిస్తోంది.

    కాంగ్రెస్ లోని సీనియర్ నేతకు కాకుండా ఇతరులకు పీసీసీ చీఫ్ ఇస్తే సీనియర్లు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. దీంతో అధిష్టానం కాంగ్రెస్ అవసరమయ్యే నేతలను మాత్రమే బుజ్జగించి వారికి కమిటీల్లో ప్రాధాన్యం కల్పించబోతున్నట్లు సమాచారం.

    కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే పీసీసీ చీఫ్ ప్రకటన చేయడంతోపాటు అన్ని జిల్లాల్లో కొత్త కమిటీలను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి యువతకే పెద్దపీఠ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని సమాచారం.