https://oktelugu.com/

‘శ్రీకారం’  మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

సినిమా: శ్రీకారం నటీనటులు: శర్వానంద్, ప్రియాంక ఆరుల్ మోహన్, రావు రమేశ్, ఆమని, సాయికుమార్, నరేశ్, మురళీ శర్మ దర్శకత్వం: కిషోర్ బి నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట సంగీతం: మిక్కీ జే మేయర్ విడుదల తేది: మార్చి 11, 2021   విలక్షణ, వినూత్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు శర్వానంద్. డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకొని హిట్ కొడుతుంటాడు. చాలా రోజుల తరువాత శర్వానంద్ కొత్తరకమైక కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సాఫ్ట్ వేర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2021 / 10:18 AM IST
    Follow us on

    సినిమా: శ్రీకారం
    నటీనటులు: శర్వానంద్, ప్రియాంక ఆరుల్ మోహన్, రావు రమేశ్, ఆమని, సాయికుమార్, నరేశ్, మురళీ శర్మ
    దర్శకత్వం: కిషోర్ బి
    నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట
    సంగీతం: మిక్కీ జే మేయర్
    విడుదల తేది: మార్చి 11, 2021

     

    విలక్షణ, వినూత్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు శర్వానంద్. డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకొని హిట్ కొడుతుంటాడు. చాలా రోజుల తరువాత శర్వానంద్ కొత్తరకమైక కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సాఫ్ట్ వేర్ వదిలి ఆధునిక వ్యవసాయం చేయాలనే తలంపుతో వదిలివచ్చిన యువకుడి కథను ఎంపిక చేసుకున్నాడు.  ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

    ఈ సినిమా ప్రీ రీలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంతో మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు సినిమాను ఆసక్తితో చూశారు. మహాశివరాత్రి సందర్భంగా గురువారం విడుదలయిన ‘శ్రీకారం’ఎలా ఉందో చూద్దాం..

    కథ:
    డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు.. హీరో కొడుకు హీరో అవుతున్నాడు.. కానీ ఒక రైతు కొడుకు మాత్రం రైతు కావడం లేదు.. వాళ్లు అస్సలే చేయడం లేదు.   ఈ పరిస్థితి మారాలి అంటూ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఓ యువకుడు రైతుగా మారి వ్యవసాయం చేయాలనుకుంటాడు. వ్యవసాయం చేస్తే లాభం తప్ప నష్టమే అనుకునే వాళ్లకు తన ఆధునిక వ్యవసాయం చేయడానికి శ్రీకారం చుడుతాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మొత్తానికి లాభం వచ్చేలా ఆధునిక వ్యవసాయం చేస్తాడు. అయితే ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం తరువాత ఎదురైన పరిస్థితులేంటి..? అన్నదే కథాంశం…

    – ప్లస్ పాయింట్స్
    శర్వానంద్, ప్రియాంక అరుల్ నటన
    వ్యవసాయంపై ఇచ్చిన మంచి మెసేజ్
    మాటలు ఆకట్టుకున్నాయి.
    సంగీతం అలరించింది.

    -మైనస్ పాయింట్స్
    ఎడిటింగ్ లోపం ఉంది..
    కథనం మెల్లిగా సాగదీశారు

    *విశ్లేషణ
    సాఫ్టవేర్ నుంచి రైతుగా మారిన పాత్రలో శర్వానంద్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు కిశోర్ కు ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీశాడు. రైతు ఎదుర్కొంటున్న సమస్యలను వెండితెరపై చూపించడానికి కిశోర్ తీవ్రంగా కసరత్తు చేశాడనే చెప్పాలి. ఈరోజుల్లో ఇలాంటి సినిమా ఎవరూ చూస్తారన్న విమర్శకుల నోళ్లు మూయించేలా కిశోర్ తన టాలెంట్ ను చూపించాడు. ఇక ఈ సినిమా ద్వారా నటీనటులకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

    ఇక సినిమా మొదటి భాగమంతా శర్వా, హీరోయిన్ ప్రియాంకల మధ్య లవ్ ట్రాక్ సాగుతుంది. నిత్యం తన పనితో బిజీగా ఉండే అబ్బాయిని ఎలా పడేయ్యాలి అనే కాన్సెప్టులో ప్రియాంక నటన ఆకట్టుకుంటుంది. సెకండ్ ఆఫ్ లో అసలు సినిమా మొదలవుతుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి రైతుగా మారిన తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కోణంలో సినిమా సాగుతుంది. అయితే ఇదివరకు మహర్షి లాంటి సినిమా ఇదే తరహాలో ఉన్నా శ్రీకారం సినిమాను మాత్రం కొత్తకోణంలో చూపించారని చెప్పవచ్చు.

    ఈ చిత్రం ద్వారా హీరో శర్వానంద వ్యవసాయం గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని కథతో కనెక్ట్ అవ్వడం విశేషం. ఈ చిత్రం వ్యవసాయ ఆధారిత తెలుగు ప్రేక్షకులకు గట్టిగా తగులుతుంది. ఎమోషన్స్ అందరినీ కదిలిస్తాయి. ఈ వారంలో తప్పనిసరిగా చూసే చిత్రంగా ‘శ్రీకారం’ నిలుస్తుందనే చెప్పాలి.

    ఓకే తెలుగు రేటింగ్: 3/5