
కరోనా, లాక్ డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఎన్నో సహాయాలు చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్ తాజాగా శ్వాసకోశ సమస్య ఉన్న బాలుడికి తనవంతు సహాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ట్విట్టర్ ద్వారా బాలుడికి సహాయం చేయనున్నట్టు సోనూ వెల్లడించారు. ముంబై ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్ లో అనారోగ్యంతో బాధ పడుతున్న బాలుడిని రేపు చేర్పిస్తానని పేర్కొన్నారు.
Also Read: క్రిష్ మామూలోడు కాదు.. పవన్‌కే షాకిచ్చాడు !
వారం రోజుల్లోగా బాలుడికి ఆపరేషన్ జరిగే విధంగా చూస్తానని.. బాలుడు త్వరగా కోలుకుంటాడని.. ఆందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం ఓ తల్లి తన కొడుకు ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు స్పందించిన సోనూసూద్ ట్విట్టర్ వేదికగా బాలుడికి సహాయం చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. బాలుడికి సోనూసూద్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించనున్నారు.
మరొకరికి సాయం చేసే దిశగా సోనూ అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోనూ స్పందించి మానవత్వం చాటుకోవడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. స్నేహల్ మిసల్ అనే మహిళ అక్టోబర్ నెల 25వ తేదీన గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని.. త్వరగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయిస్తే మంచిదని పలువురు వైద్యులు సూచించారని అన్నారు.
Also Read: చిరంజీవి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్
సోనూసూద్ ఇప్పటికే చాలామందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పాటు బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల కష్టాలు తీర్చేందుకు సోనూసూద్ ఖర్చు చేస్తున్నారు. ఎంతోమంది స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు చేయలేని పనిని సోనూ చేసి ప్రశంసలు పొందుతున్నారు.
Tomorrow your son will be admitted to SRCC Hospital Mumbai. Surgery will be scheduled this week ❣️🙏 https://t.co/nym4H8Z2gr
— sonu sood (@SonuSood) October 25, 2020