https://oktelugu.com/

డ్రగ్స్ కొంటూ దొరికిన నటి.. షాక్ లో ఫ్యాన్స్..?

స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా అగర్వాల్ కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. రియా సోదరుడు షోవిక్ ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు. డ్రగ్స్ కేసులో పలువురు స్టార్ హీరోయిన్లను సైతం అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. Also Read: వీసా కోసం పెళ్లి చేసుకున్నానంటున్న స్టార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 26, 2020 / 06:15 AM IST
    Follow us on


    స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా అగర్వాల్ కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. రియా సోదరుడు షోవిక్ ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు. డ్రగ్స్ కేసులో పలువురు స్టార్ హీరోయిన్లను సైతం అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

    Also Read: వీసా కోసం పెళ్లి చేసుకున్నానంటున్న స్టార్ హీరోయిన్…?

    డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అధికారులు డ్రగ్స్ డీలర్లపై డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో మరో నటి అరెస్ట్ అయ్యారు. టీవీ నటి ప్రీతికా చౌహన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ల నుంచి డ్రగ్స్ తీసుకునే సమయంలో ప్రీతికా చౌహాన్ పట్టుబడటంతో ఈ కేసులో మరి కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

    ‘సంవాదన్ ఇండియా’, ‘దేవో కె దేవ్ మహదేవ్’ , ఇతర సీరియళ్లలో ప్రీతికా చౌహాన్ నటించింది. ఆమెను అధికారులు రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. వెర్సోవా, ముంబైలలో సివిల్ డ్రస్ లో ఉన్న ముంబై ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లపై దృష్టి పెట్టి ప్రీతికా చౌహాన్ ను అరెస్ట్ చేశారు. ప్రీతికాతో పాటు అధికారులు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

    Also Read: రష్మిక ఎవరినీ వదిలిపెట్టడం లేదుగా..!

    అధికారులు డ్రగ్స్ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులకు సంబంధించిన ప్రతి విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అధికారులు తీగ లాగితే ఈ కేసులో డొంక కదులుతోంది.