శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ టోకెన్ల జారీకి గ్రీన్ సిగ్నల్..!

కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పాటు దేవాలయాలపై కూడా పడిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ మూతబడని శ్రీవారి ఆలయం సైతం కరోనా, లాక్ డౌన్ వల్ల మూతబడింది. అయితే అన్ లాక్ సడలింపుల వల్ల కొన్ని నెలల క్రితం శ్రీవారి ఆలయం తెరుచుకున్నా పరిమిత సంఖ్యలోనే భక్తులకు టీటీడీ అనుమతిస్తోంది. అయితే టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. Also Read: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..? […]

Written By: Navya, Updated On : October 26, 2020 12:36 pm
Follow us on


కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పాటు దేవాలయాలపై కూడా పడిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ మూతబడని శ్రీవారి ఆలయం సైతం కరోనా, లాక్ డౌన్ వల్ల మూతబడింది. అయితే అన్ లాక్ సడలింపుల వల్ల కొన్ని నెలల క్రితం శ్రీవారి ఆలయం తెరుచుకున్నా పరిమిత సంఖ్యలోనే భక్తులకు టీటీడీ అనుమతిస్తోంది. అయితే టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది.

Also Read: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..?

శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లను జారీ చేయడానికి సిద్ధమవుతుంది. దాదాపు 60 రోజుల తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్ల జారీ జరుగుతోంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో అక్టోబర్ 26వ తేదీ నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 3 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నామని.. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతామని టీటీడీ చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ అవుతాయి.

దర్శనానికి ఒక రోజు ముందు సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శ్రీవారి భక్తులకు ప్రయోజనం చేకూరనుంది. అలిపిరి నుంచి కొండపైకి సర్వదర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నామని అధికారులు చెబుతున్నారు. టీటీడీ తీసుకున్న సర్వదర్శనం టికెట్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఉల్లి ధరల ఘాటు తగ్గనుందా? కేంద్రం కీలక నిర్ణయాలు

గతంలో రోజుకు లక్ష మంది శ్రీవారి దర్శనానికి హాజరయ్యేవారు. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల పరిమిత సంఖ్యలో మాత్రమే టీటీడీ భక్తులకు అనుమతిస్తోంది. పరిస్థితులు చక్కబడితే ముపటిలా దర్శనానికి టీటీడీ పూర్తిస్థాయిలో ఆంక్షలు తొలగించనుంది.