https://oktelugu.com/

మెగాస్టార్ చిరుకు సోనూ సూద్ చిరుకానుక

దేశంలోనే ఆపదలో నేనున్నాంటే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోకున్నా సరే.. తానున్నాంటూ ముందుకొచ్చాడు ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ వేళ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ సోనూ సూద్ చేసిన సేవలూ ఎవ్వరూ మరిచిపోలేదు. అందుకే ఆయన పేరిట దేవాలయాలు, గుడులు, గోపురాలు, షాపులు వెలుస్తున్నాయి. సోనూ సూద్ ను దేవుడిలా అందరూ కీర్తిస్తున్నారు. Also Read: సామ్ జామ్ లో ఎమోషనలైన బన్నీ! ఈ క్రమంలోనే ఆపదలో ఉన్న వారికి ఇప్పటికీ సోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2020 / 09:20 PM IST
    Follow us on

    దేశంలోనే ఆపదలో నేనున్నాంటే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోకున్నా సరే.. తానున్నాంటూ ముందుకొచ్చాడు ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ వేళ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ సోనూ సూద్ చేసిన సేవలూ ఎవ్వరూ మరిచిపోలేదు. అందుకే ఆయన పేరిట దేవాలయాలు, గుడులు, గోపురాలు, షాపులు వెలుస్తున్నాయి. సోనూ సూద్ ను దేవుడిలా అందరూ కీర్తిస్తున్నారు.

    Also Read: సామ్ జామ్ లో ఎమోషనలైన బన్నీ!

    ఈ క్రమంలోనే ఆపదలో ఉన్న వారికి ఇప్పటికీ సోనూ సూద్ సాయం చేస్తూ తన ఊదారతను చాటుకుంటున్నాడు. సోనూసూద్ ఊదారతపై తాజాగా ‘ఐయామ్ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని మీనా. కే. అయ్యర్ రచించారు.

    ప్రస్తుతం సోనూ సూద్ ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్ లో చిరంజీవి కూడా ఉండడంతో తనపై రచించిన పుస్తకాన్ని సోనూసూద్ తాజాగా సెట్ లో మెగాస్టార్ కు అందించారు.

    Also Read: జనవరి 4 నుండి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ !

    ఈ పుస్తకాన్ని తీసుకున్న చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపి ఇలా అభాగ్యులకు సహాయపడుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలవాలని కోరారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్