https://oktelugu.com/

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 41 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..! ఆసక్తి ఉన్న అభ్యర్థులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2020 12:03 pm
    Follow us on

    PFC Notification
    దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 41 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!

    ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2021 సంవత్సరం జనవరి 18వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. https://www.pfcindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?

    కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖస్తు చేసుకోవచ్చు. మొత్తం 41 ఖాళీలలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు 34 ఉండగా క‌న్స‌ల్టెంట్ టెక్నిక‌ల్‌-1 ఉద్యోగాలు 6, క‌న్స‌ల్టెంట్ టెక్నిక‌ల్‌-2 ఉద్యోగాలు 1 ఉన్నాయి. బీఈ / బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ లలో చదివిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నిక‌ల్ నైపుణ్యాల్లో నాలెడ్జ్ ఉండటంతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.