https://oktelugu.com/

టీడీపీ నేత శవంతో ప్రొద్దుటూరులో లోకేష్ పోరుబాట.. ఉద్రిక్తం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పోరుబాట పట్టారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు లోకేష్ ధైర్యం చెప్పి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. Also Read: దారుణం.. గంటల చొప్పున భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..! టీడీపీ నేత సుబ్బాకను ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు ఇటీవల కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2020 / 09:09 PM IST
    Follow us on

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పోరుబాట పట్టారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు లోకేష్ ధైర్యం చెప్పి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

    Also Read: దారుణం.. గంటల చొప్పున భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..!

    టీడీపీ నేత సుబ్బాకను ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు ఇటీవల కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల చిధ్రమైంది. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని.. ఇది వైసీపీ చేసిన హత్య అని టీడీపీ ఆరోపించింది.

    ఈ క్రమంలోనే హత్యకు గురైన సుబ్బయ్య భార్య అపరాజిత పరామర్శకు వచ్చిన నారా లోకేష్ ముందు గోడు వెళ్లబోసుకుంది. తన భర్తను వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి హతమార్చారని.. పోలీసులు అరెస్ట్ చేసే వరకు తనకు అండగా నిలవాలని లోకేష్ ను కోరారు.

    Also Read: ఏపీలో ముందే సంక్రాంతి పండుగొచ్చింది: జగన్

    ఈ క్రమంలోనే లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. ఎఫ్ఐఆర్ లో వారి పేర్లను చేర్చేవరకు కదిలేది లేదని సుబ్బయ్య మృతదేహంతో ధర్నాకు దిగారు. వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చేవరకు ప్రొద్దుటూరును వీడేది లేదని లోకేష్ బైఠాయించడం సంచలనమైంది. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే భయపడేలా చేస్తామని లోకేష్ హెచ్చరించారు.

    ధర్నా కొనసాగిస్తున్న లోకేష్, టీడీపీ నేతలతో డీఎస్పీలు చర్చలు జరిపారు.ఆందోళన విరమిస్తే పేర్లు చేర్చే విషయంపై పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఆందోళనలో లోకేష్ వెంట భూమా అఖిలప్రియ, జిల్లా నేతలు, పెద్ద ఎత్తున తరలివచ్చి భైటాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్