2020 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రేపు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన ఒక సూర్యగ్రహణం ఏర్పడగా రేపు మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది. రేపు రాత్రి 7 గంటల 23 నిమిషాలకు ఈ సూర్యగ్రహణం ప్రారంభం కానుండగా డిసెంబర్ 15 రాత్రి 12.24 గంటల వరకు గ్రహణం ఉంటుంది. మొత్తం 5 గంటల పాటు గ్రహణం ఉండగా భారతదేశంలో సూర్యుడు కనిపించడని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక!
రేపు రాత్రి 8 గంటల 2 మినిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభం కానుండగా 9 గంటల 43 నిమిషాల వరకు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది. అయితే గ్రహణం కనిపించకపోయినా ప్రపంచమంతటా గ్రహణ ప్రభావం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. గర్భిణులు గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
Also Read: 2050లో యుగాంతం.. భూమిపై మహాప్రళయం సంభవించబోతుందా..?
గర్భిణులు గ్రహణ సమయంలో బయటకు వస్తే పిండంపై ప్రభావం పడుతుంది. గ్రహణ సమయంలో కొన్నిసార్లు చెడు శక్తులు ప్రభావవంతంగా పని చేస్తాయని.. ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ సైతం మనుషులకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతునారు. గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుండతంతో మనం ఈ గ్రహణాన్ని చూడటం సాధ్యం కాదు. గ్రహణ సమయంలో పదునైన వస్తువులను కూడా ఉపయోగించకూడదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
గ్రహణం సమయంలో శుభ కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దానం చేయాలనుకున్న వస్తువులను గ్రహణం ముందే ఇంటి బయట పెట్టి గ్రహణం ముగిసిన తర్వాత దానం చేస్తే మంచిది.