https://oktelugu.com/

బీజేపీ ఆకర్ష్.. టార్గెట్ వంద స్థానాలు..!

తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని బీజేపీ ఓడించి కాషాయ జెండాను ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లు సాధించి సత్తా చాటింది. Also Read: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. అయోమయంలో ‘బండి’..! ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు కమలదళం గట్టి పోటీ ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీకి భారీ మైలేజ్ వచ్చింది. దీంతో ఇతర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 07:35 PM IST
    Follow us on

    తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని బీజేపీ ఓడించి కాషాయ జెండాను ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లు సాధించి సత్తా చాటింది.

    Also Read: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. అయోమయంలో ‘బండి’..!

    ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు కమలదళం గట్టి పోటీ ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీకి భారీ మైలేజ్ వచ్చింది. దీంతో ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ పెద్దలు సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు.

    సినీ నటి విజయశాంతితో మొదలైన చేరికలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా స్థానిక బీజేపీ నేతలు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తూ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో కొద్దిరోజులుగా పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు.

    Also Read: రైతులతోపాటు దీక్ష చేయనున్న ఢిల్లీ సీఎం.. ఎప్పుడంటే?

    ఇదిలా ఉంటే  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ వంద స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు బీజేపీ పెద్దలు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం సూచనల మేరకు స్థానిక నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే రెడీ ఉన్నట్లు లీకులు కూడా విన్పిస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్