https://oktelugu.com/

తల్లికాబోతున్న ప్రముఖ సింగర్.. ఫొటో షేర్ చేసిందిలా..!

ఆమె పాట.. కోయిల కంటే తీయన.. ఆమె స్వరం వింటే చాలు మైమరిపోవాల్సిందే.. తెలుగులో ఎన్నో ప్రేమ పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆ ప్రముఖ సింగర్ ఇప్పుడు తల్లి కాబోతోందట.. ఈ మేరకు తన పర్సనల్ ఫొటో షేర్ చేసి మరీ ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. అత్యద్భుతంగా పాటలు పడే బాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అంటే తెలియని వారు ఉండరు. భారతదేశంలోని పలు భాషల్లో పాటలు పాడి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2021 / 01:10 PM IST
    Follow us on

    ఆమె పాట.. కోయిల కంటే తీయన.. ఆమె స్వరం వింటే చాలు మైమరిపోవాల్సిందే.. తెలుగులో ఎన్నో ప్రేమ పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆ ప్రముఖ సింగర్ ఇప్పుడు తల్లి కాబోతోందట.. ఈ మేరకు తన పర్సనల్ ఫొటో షేర్ చేసి మరీ ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది.

    అత్యద్భుతంగా పాటలు పడే బాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అంటే తెలియని వారు ఉండరు. భారతదేశంలోని పలు భాషల్లో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమెకు ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను ఆమె వివాహం చేసుకున్నారు.

    ఇటీవల తెలుగులో ఉప్పెన మూవీ కోసం శ్రేయా ఘోషల్ ‘జలజల జలపాతం’ నువ్వు పాటను అలపించారు. జస్రిత్ జాజ్ తో కలిసి శ్రేయా ఈ పాటను పాడగా.. ఇది అందరినీ ఆకట్టుకొని మంచి వ్యూస్ ను సంపాదించిన విషయం తెలిసిందే..

    అభిమానులకు తాజాగా శ్రేయా ఘోషల్ గుడ్ న్యూస్ తెలిపారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. బేబి శ్రేయాదిత్య త్వరలోనే వస్తున్నారంటూ కామెంట్ పెట్టారు. తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందంటూ పేర్కొన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయానికి మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ శ్రేయ ట్వీట్ చేశారు.

    శ్రేయ తాజాగా షేర్ చేసిన ఫొటో ఆమె గర్భవతిగా ఉంది. చాలా మంది అభిమానులు ఆమెకు అభినందనలు తెలిపారు.