‘షా’ ప్లాన్‌ చేస్తే.. అమలు జరగాల్సిందే..!

దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు అమిత్‌ షా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు పెద్ద సంఖ్యలోనే ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అదే వాస్తవం కూడా. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు.. ఒక్కో రాష్ట్రాన్ని ఒడిసిపడుతూ తన మైండ్ పవర్ చూపిస్తున్నారు షా. తాజాగా తమిళనాట రాజకీయాల్లో జరిగిన నాటకీయ పరిణామాలు ఆయన చాణక్యాన్ని మరోసారి బయటపెట్టాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శశికళ చేసిన ప్రకటన వెనక కూడా అమిత్ […]

Written By: Srinivas, Updated On : March 4, 2021 12:59 pm
Follow us on


దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు అమిత్‌ షా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు పెద్ద సంఖ్యలోనే ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అదే వాస్తవం కూడా. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు.. ఒక్కో రాష్ట్రాన్ని ఒడిసిపడుతూ తన మైండ్ పవర్ చూపిస్తున్నారు షా. తాజాగా తమిళనాట రాజకీయాల్లో జరిగిన నాటకీయ పరిణామాలు ఆయన చాణక్యాన్ని మరోసారి బయటపెట్టాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శశికళ చేసిన ప్రకటన వెనక కూడా అమిత్ షా చాతుర్యం ఉందనేది స్పష్టం.

Also Read: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం ఎలా అవుతుంది..?

నిన్నామొన్నటి వరకూ బీజేపీ గుర్తుపై శశికళ వర్గాన్ని పోటీ చేయించాలని చూశారు అమిత్ షా. అయితే.. ఆ ప్రతిపాదనకు ఆమె ససేమిరా అనడంతో ఏకంగా శశికళతో రాజకీయ సన్యాసం చేయించారు. ‘తమిళనాట జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా, అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంగా పనిచేయాలి. ఇకపై నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నా దైవం పురచ్చితలైవి బంగారుపాలన కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తా’ అంటూ ఓ లేఖ విడుదల చేశారు శశికళ.

Also Read: ముగిసిన శశికళ ప్రయాణం.. ఎందుకు తప్పుకుంది? బీజేపీ ఒత్తిడేనా?

గతంలో తమిళ నాట రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్లు ఉండేవి. జయలలిత, కరుణానిధి హయాం మొదలైన తర్వాత ఈ దఫా వారిద్దరూ లేకుండా తొలి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్, డీఎంకేకు మద్దతిస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ చేతిలో పావుగా మారింది. శశికళను జైలుకి పంపించడంలో బీజేపీ పాత్ర ఎంతుందో.. ఆమె బయటకు రావడంలో కూడా ఆ పార్టీ ప్లానింగ్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

శశికళను బయటకు తేవడం వల్ల అన్నాడీఎంకే బలం పెరుగుతుందని, డీఎంకేని ఓడించడంలో ఆమె సహాయపడుతుందనేది బీజేపీ ఆలోచన. అయితే.. శశికళ వచ్చీ రావడంతోనే అన్నాడీఎంకే నాయకుల్ని టార్గెట్ చేయడంతో వ్యవహారం రివర్స్ అయింది. వారి మధ్య సయోధ్య కుదిర్చిన అమిత్ షా.. మరో బ్రహ్మాండమైన ఎత్తుగడ వేశారు. శశికళ రాజకీయాల్లో ఉంటే ఆమెను అభిమానించే వర్గం కచ్చితంగా అన్నాడీఎంకేని వ్యతిరేకిస్తుంది. అది పరోక్షంగా డీఎంకేకి లాభం. శశికళను రాజకీయాలకు దూరం చేసి, ఆమెతోనే కార్యకర్తలంతా కలిసుండాలనే ప్రకటన చేయిస్తే.. అప్పుడు తిరుగుండదు. సరిగ్గా అదే ప్లాన్ అమలు చేశారు షా.