అత్యంత ప్రజాదరణబుల్లెట్‌ నడపబోయి.. బోల్తా పడ్డ నాని హీరోయిన్‌

బుల్లెట్‌ నడపబోయి.. బోల్తా పడ్డ నాని హీరోయిన్‌


మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. రాని పని ట్రై చేయకూడదు. ఓ తెలుగు సినిమా డైలగ్‌ ఇది. నాని సూపర్ హిట్‌ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ ఇప్పుడు ఇదే డైలాగ్‌ చెబుతోంది. ఎందుకంటే రాని పని ట్రై చేస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఆమెకు అర్థమైంది. శ్రద్ధా తాజా మూవీ ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ గురువారమే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంలో దగ్గుబాటి రానా సమర్పించిన ఈ మూవీకి రవికాంత్ పేరూరు దర్శకత్వం వహించారు. సిద్దూ జొన్నలగడ్డ హీరో. శ్రద్ధతో పాటు సీరత్ కపూర్, శాలినీ కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతున్నప్పుడే శ్రద్ధకు పై డైలాగ్‌ అర్థం తెలిసింది. తాను రాకపోయినా బుల్లెట్‌ నడిపే ప్రయత్నం చేసిన శ్రద్ధ కిందపడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెకు దెబ్బలేమీ తగల్లేదు. కానీ, ఈ ఘటన వల్ల తనకు ఓ విషయం బోధపడిందని శ్రద్ధ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. బైక్‌ నుంచి కింద పడిన వీడియోను షేర్ చేసింది.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

‘ఇండియన్‌ ఫిల్మ్‌ లో బోల్డ్‌ ఫీమేల్‌ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆమె బైక్‌ నడిపే సీన్‌ లేని సినిమాను ఊహించుకోగలమా. జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్ లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రాత్రి వర్షం పడడంతో ఆ రోజు రోడ్డు తడిగా ఉన్నాయి. షూటింగ్ లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా అని అడిగారు. దానికి నేను.. రాదు కానీ.. ట్రై చేస్తా అన్నాను. ఎందుకంటే నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉంది. గెర్లు ఎలా వేయాలి, ఎలా ముందుకెళ్లాలి అని కొంచె అవగాహన ఉంది. అయినా చాన్నాళ్ల తర్వాత నేను మళ్లీ బైక్‌ ఎక్కా. అయినా నాకు భయం వేయలేదు. నేను రైడ్‌ చేయగలనని అనుకున్నా. పైగా, నా వల్ల షూటింగ్‌ కాంప్రమైజ్‌ కాకూదని భావించా. కానీ, రాయల్ ఎన్ ఫీల్డ్ ఎక్కి అలా టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి కిందపడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. నేను కిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా తెగ భయపడ్డారు. నా దగ్గరికి వచ్చి హెల్ప్‌ చేశారు. కానీ, బైక్‌కు ఏవైనా స్క్రేచ్స్ పడ్డాయా అనే ఎక్కువగా కంగారు పడ్డారు. అయినా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ ఎందుకంత బరువుగా ఉంటుందబ్బా..?’ అని ప్రశ్నిస్తూ శ్రద్ధా తన అనుభవాన్ని షేర్ చేసింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

August movie releases: ఆగస్టు లో అసలు సినిమా పోటీ మొదలవ్వనుందా..?

August movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. హీరోలు వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికి చిన్న పెద్దా అనే...

Akhil Lenin movie: అఖిల్ కి లెనిన్ మూవీ తో భారీ సక్సెస్ రాబోతోంది..?

Akhil Lenin movie: అఖిల్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులకు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version