https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్​లో అజయ్‌ దేవగణ్ పాత్ర రివీల్?

బాహుబలితో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. (రౌద్రం, రణం, రుధిరం). తెలుగుతో పాటు తమిళ్, హిందీలో నేరుగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్‌ పోస్టర్.. రామ్‌ చరణ్‌ ఫస్ట్‌ లుక్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం […]

Written By:
  • admin
  • , Updated On : June 30, 2020 9:36 am
    Follow us on


    బాహుబలితో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. (రౌద్రం, రణం, రుధిరం). తెలుగుతో పాటు తమిళ్, హిందీలో నేరుగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్‌ పోస్టర్.. రామ్‌ చరణ్‌ ఫస్ట్‌ లుక్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్‌‌ అడవుల్లోని కొమురం భీమ్ విప్లవ వీరులుగా మారకముందు కలుసుకుంటే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్‌‌ స్టోరీని తెరపై ఆవిష్కరించబోతున్నాడు జక్కన్న. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కూడా చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

    పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

    ఈ మూవీలో ఈ ఇద్దరు దక్షిణాది విప్లవ వీరులతో పాటు ఒక ఉత్తరాది విప్లవ వీరుడు కూడా కనిపించబోతున్నాడట. ఆ పాత్రనే అజయ్‌‌ దేవగణ్‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అది మరెవరిదో కాదు భగత్‌‌ సింగ్ అని సమాచారం. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ హీరోలపై దాని ప్రభావం ఎక్కువ ఉంటుందట. రామరాజు, భీమ్‌లకు మార్గనిర్ధేశం చేసి వాళ్లను సతంత్ర్య సమరం వైపు మళ్లించే గురువు పాత్రనే అజయ్‌ పోషించబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవల తాను అజయ్ దేవగన్‌‌కి జంటగా నటించబోతున్నట్టు శ్రియ చెప్పింది. అవి అజయ్ పోషిస్తున్న భగత్‌‌ సింగ్‌‌ పాత్ర ప్లాష్ బ్యాక్ సీన్స్‌‌ అని సమాచారం. కాగా, భగత్ పాత్ర పోషించడం అజయ్‌‌కి కొత్తేమీ కాదు. గతంలో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’లోనటించి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. అందుకే ఈ పాత్రకు దేవగణ్‌ను రాజమౌళి ఒప్పించాడట.