నరేంద్ర మోడీకి గట్టి షాక్

ఎంత బలవంతపు పాము అయినా చలి చీమల చేత చిక్కి చచ్చినట్టు ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన మోడీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మోడీ సర్కార్ పై రైతులు దండెత్తారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. వారికి మద్దతుగా దేశమంతా కదలుతోంది. రైతులకు కోట్ల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని 14 పార్టీలు మద్దతుఇచ్చారు. ఇదో పెద్ద ఉద్యమంగా మారి ఢిల్లీ పీఠాలు కదిలించేస్థాయికి చేరుతోంది. Also Read: కొత్త పార్లమెంట్ భవనం వింతలు, […]

Written By: NARESH, Updated On : December 7, 2020 2:12 pm
Follow us on

ఎంత బలవంతపు పాము అయినా చలి చీమల చేత చిక్కి చచ్చినట్టు ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన మోడీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మోడీ సర్కార్ పై రైతులు దండెత్తారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. వారికి మద్దతుగా దేశమంతా కదలుతోంది. రైతులకు కోట్ల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని 14 పార్టీలు మద్దతుఇచ్చారు. ఇదో పెద్ద ఉద్యమంగా మారి ఢిల్లీ పీఠాలు కదిలించేస్థాయికి చేరుతోంది.

Also Read: కొత్త పార్లమెంట్ భవనం వింతలు, విశేషాలివీ

ఓవైపు ఢిల్లీలో సెగ తగులుతుంటే ప్రధాని మోడీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ దారుణంగా ఓడిపోవడం సంచలనమైంది.జీహెచ్ఎంసీలో మంచి సీట్లు సాధించిన ఆనందం మరువక ముందే మోడీ సొంత ఇలాకాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓడిపోవడం కమలనాథులను కలవరపెడుతోంది.

Also Read: రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు.. పునరాలోచనలో కేంద్రం..!

మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక ఆయనపై వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.. ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కరోనా టైంలో మోడీ ఏం చేయని వైనంపై జనాలు రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై ఎంత రగిలిపోతున్నారో మెల్లిమెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే రైతుల ఆందోళనతో అది బయటపడింది. ఇక నుంచి మోడీ హనీమూన్ ముగిసిందని.. ఆయనపై వ్యతిరేకత బయటపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

వారణాసిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజాగా పదేళ్ల తర్వాత ఈ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ గెలుపొందడం విశేషం. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అశుతోష్ సిన్హా, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో లాల్ బిహారీ యాదవ్ విజయం సాధించారు. మొత్తం 11 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగగా నాలుగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. మరో రెండింటి ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తం యూపీలో అధికారంలో ఉండి బీజేపీ ఓడి ప్రతిపక్షం సమాజ్ వాదీ గెలవడంతో వచ్చే యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదికి కొత్త బలం వచ్చినట్టైంది.