https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించనున్న షర్మిల?

‘ఆకాశంలో సగం..అన్నింటా అన్యాయం..’అనే సామెతకు ఇక స్వస్తి పలికినట్లేనా..? మహిళలు ఇక  అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే మహిళ ఇప్పుడు అబల కాదు.. సబల అని నిరూపించుకుంటోంది. రంగమేదేనా రణరంగాన్ని సృష్టించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమన్న నారీ నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా భారత్ లోని మహిళలు రాజకీయాల్లో రాటుదేలుదున్నారు. కేవలం పార్టీ పదవులకే పరిమితం కాకుండా.. పార్టీ పెట్టే స్థాయికి ఎదుగుతున్నారు. వీరిలో ఒక […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 11:58 AM IST
    Follow us on

    ‘ఆకాశంలో సగం..అన్నింటా అన్యాయం..’అనే సామెతకు ఇక స్వస్తి పలికినట్లేనా..? మహిళలు ఇక  అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే మహిళ ఇప్పుడు అబల కాదు.. సబల అని నిరూపించుకుంటోంది. రంగమేదేనా రణరంగాన్ని సృష్టించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమన్న నారీ నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా భారత్ లోని మహిళలు రాజకీయాల్లో రాటుదేలుదున్నారు. కేవలం పార్టీ పదవులకే పరిమితం కాకుండా.. పార్టీ పెట్టే స్థాయికి ఎదుగుతున్నారు. వీరిలో ఒక జయలలిత కావచ్చు.. ఒక మమతా బెనర్జీ కావచ్చు… త్వరలో షర్మిల కావచ్చు..?

    Also Read: కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే..: ఏపీలో ప్రతిపక్షాల డిమాండ్‌

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో అలజడి సృష్టిస్తోంది. రాజకీయంగా ఇన్నాళ్లు స్తబ్దంగా ఉన్న రాష్ట్రంలో షర్మిల పార్టీ పెడుతుండడం సంచలనంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం కారు స్పీడుకు తట్టుకోలేకపోయింది. దీంతో ఆరేళ్లపాటు గులాబీ పార్టీ తిరుగులేకుండా పాలించింది. అయితే కొన్ని నెలల కిందట దుబ్బాక వంటి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితిని చూసి తెలంగాణకు ఇక బిజేపీయే దిక్కు అని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా షర్మిల పార్టీ పెట్టడం ఒక్క సారిగా రాజకీయంగా కలకలం రేపింది.

    తెలంగాణలోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోన్న షర్మిల పార్టీ పెట్టేందుకుసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్ వైఎస్ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ  తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది..? టీఆర్ఎస్ పై ప్రజలు ఏమనుకుంటున్నారు..? లాంటి ప్రశ్నలు వేయడంతో షర్మిల ఇక రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమనే తెలుస్తోంది.

    Also Read: నేడు ఏపీ కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాల దిశగా జగన్

    ఇకవేళ షర్మిల పార్టీ స్థాపించినట్లయితే రికార్డు సృష్టించినట్లే. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు.. హోంమంత్రి స్థాయికి పదవులు చేపట్టారు.. కానీ పార్టీ పెట్టే స్థాయికి ఎవరూ రాలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టిన మొదటి మహిళగా షర్మిల నిలుస్తారు. ఒక మహిళగా.. వైఎస్ కూతురిగా తనను కచ్చితంగా ఆదరిస్తారనే ఆశాభవంతో షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్