2021లో రికార్డ్: ఉప్పెన కలెక్షన్స్ 21 కోట్ల టార్గెట్ కు 10 రోజుల్లో వచ్చింది ఇదీ

ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ బాక్సాఫీసును ‘ఉప్పెన’ ఊపేసింది. తొలి చిత్రంతోనే మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’తో గ్రాండ్ హిట్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో లాక్ డౌన్ కు ముందే పూర్త‌యిన ఈ సినిమా.. రిలీజ్ కోసం లాక్ డౌన్ మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా.. హీరో ముఖం చూసి ఆగిపోయారు మేకర్స్. మొదటి సినిమా.. అందులోనూ మెగా వారసుడు.. ఇన్ని కారణాలతో ఏదైతే అయ్యిందిలే అని వెయిట్ చేశారు. […]

Written By: NARESH, Updated On : February 23, 2021 12:04 pm
Follow us on

ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ బాక్సాఫీసును ‘ఉప్పెన’ ఊపేసింది. తొలి చిత్రంతోనే మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’తో గ్రాండ్ హిట్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో లాక్ డౌన్ కు ముందే పూర్త‌యిన ఈ సినిమా.. రిలీజ్ కోసం లాక్ డౌన్ మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా.. హీరో ముఖం చూసి ఆగిపోయారు మేకర్స్. మొదటి సినిమా.. అందులోనూ మెగా వారసుడు.. ఇన్ని కారణాలతో ఏదైతే అయ్యిందిలే అని వెయిట్ చేశారు. చివరకు.. ఆలస్యమే ఆ సినిమాకు వరమైంది. ఈ గ్యాప్ లో సినిమా గురించి జనాల్లో బాగా చర్చకు స్కోప్ ఏర్పడింది. ప్రమోషన్ కోసం కూడా కావాల్సినంత టైం దొరికింది.

Also Read: ఉప్పెన టీం సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

పాటలు జనాల్లో మారుమోగాయి.. సోషల్ మీడియాతోపాటు ప్రధాన స్రవంతిలోనూ మంచి డిస్కషన్ జరిగింది. ఇన్ని ప్లస్ పాయింట్లతో 12వ తేదీన సోలో గా థియేటర్లోకి ఎంటరైంది ‘ఉప్పెన’. దీంతో.. తొలిరోజు మంచి ఓపెనింగ్ దక్కించుకుందీ చిత్రం. నిజానికి.. ఒక డెబ్యూ హీరో, కొత్త డైరెక్టర్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ రావడం అన్నది గొప్ప విష‌య‌మే.

ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఫ్యామిలీలు కూడా క‌నిపించ‌డం విశేషం. సంక్రాంతికి విడుద‌లైన సినిమాల‌కు యూత్ మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపించారు. అప్ప‌టికి క‌రోనా భ‌యం పోలేదు కాబ‌ట్టి.. మొండిగా యువ‌కులు మాత్ర‌మే టిక్కెట్లు తెంపారు. ఇప్పుడు వ్యాక్సిన్ కూడా రావ‌డం.. సినిమా థియేట‌ర్ ముఖం చూడ‌క ఏడాది కావ‌స్తుండ‌డంతో ఫ్యామిలీతో థియేట‌ర్లో అడుగు పెడుతున్నారు ప్రేక్ష‌కులు.

ఉప్పెన సినిమా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో జనాలు క్యూ కట్టారు. తొలి రోజున మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది ఉప్పెన. పైగా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా సినిమాలు ఏమీ లేవు. కాబ‌ట్టి క‌లెక్ష‌న్స్ నిల‌క‌డ‌గా ఉండే అవ‌కాశం ఉంది.

బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని సింగిల్ గా కంప్లీట్ చేసిన ఈ మూవీ రెండో వారంలో 4 కొత్త సినిమాల పోటీని తట్టుకొని కూడా నిలబడింది. దుమ్ములేపే కలెక్షన్స్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ రికార్డులను నమోదు చేసింది.

Also Read: శంకర్ -రాంచరణ్ సినిమాలో పవన్ ప్లేసులో కోలివుడ్ స్టార్

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించిన సినిమా మొత్తం మీద బిజినెస్ 20జ5 కోట్లు కాగా.. బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కాగా లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్ ను అందుకుంది. 2021లో టాలీవుడ్ తరుఫున మొట్టమొదటి 79 కోట్ల గ్రాస్ మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

10రోజుల ఉప్పెన కలెక్షన్స్ ఇవీ
————
-నైజాం -13.17 కోట్లు
-సీడెడ్- 6.51 కోట్లు
-కృష్ణా -2.74 కోట్లు
-నెల్లూరు-1.51 కోట్లు
-తూర్పు గోదావరి -4.22 కోట్లు
-పశ్చిమ గోదావరి -2.33 కోట్లు
-గుంటూరు -2.59 కోట్లు
————
*ఏపీ-తెలంగాణ టోటల్ -40.36 కోట్లు (64.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్)

కేరళ+ రెస్ట్ ఆఫ్ ఇండియా -2.16 కోట్ల ు

-అమెరికా-7.29 కోట్లు

ఓఎస్-1.26 కోట్లు దాదాపుగా..

మొత్తం కలెక్షన్లు: 43.78 కోట్లు (70.05 కోట్ల గ్రాస్)

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్