భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్.. మాజీ మంత్రి శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలని తాను రాష్ట్రపతిని కోరుతానని.. అలాగే ఆయన పేరును గిన్నిస్ బుక్ లో నమోదు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: బీజేపీలో సీఎం ఫైట్: కిషన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్
కరోనా వైరస్.. వైద్యంపై తన అభిప్రాయాలను పంచుకునేందుకు మీడియా ముందుకు వచ్చానని చెప్పిన శంకర్రావు అనుహ్యంగా ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నరేంద్ర మోదీ మూడుసార్లు సీఎం.. ఆరున్నర ఏళ్లుగా ప్రధానిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. కరోనా మహమ్మారి దేశంలో ప్రబలకుండా మోదీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.
కరోనా వైరస్ 60ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా వస్తుందని తెలిపారు. దేశంలో 90లక్షల మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్ లో రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
Also Read: రామమందిరం కోసం విరాళాల సేకరణ.. ఎప్పటి నుంచి?
స్వచ్ఛ భారత్.. జీఎస్టీ.. త్రిఫుల్ తలాక్ వంటి ఎన్ననో మంచి పథకాలను మోదీ తీసుకొచ్చాని కొనియాడారు. మోదీ పేరును గిన్నిస్ బుక్ లోనూ నమోదు చేయాలని కోరారు.
కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్న శంకర్రావు అనుహ్యంగా ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపుతోంది. అయితే తాను బీజేపీలో చేరబోనని శంకర్రావు స్పష్టం చేయడం గమనార్హం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్