‘‘ఆలూ లేదు.. చూలు లేదు.. తెలంగాణ సీఎం పేరు ‘కిషన్ రెడ్డి’ అన్నాడట’’ ఆ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబూరావు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా కిషన్ రెడ్డి ఖాయం అని బాబూరావు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలుపుతో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంపై ఆశలు పెంచుకుంది. పార్టీ బలోపేతం కోసం పాటుపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పక్కనపెట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి సీఎం అన్న మాట తెరపైకి రావడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: ‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ
తాజాగా ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని.. కాబోయే సీఎం కిషన్ రెడ్డిదేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ప్రకటించేశారు. బాపూరావు ప్రకటన బీజేపీలో కలకలం రేపింది.
కిషన్ రెడ్డి పేరును ఆయన మద్దతు దారులు వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. అయితే మెజార్టీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైపే ఉన్నారు. ఆయన వల్లే పార్టీ ఈ స్థితికి చేరిందని అంటున్నారు.
తెలంగాణలో బండి సంజయ్ దూకుడు బీజేపీకి ఊపిరిలూదింది. కానీ సీనియర్ కావడం.. కేంద్రమంత్రిగా ఉండడంతో పరిపాలన, అనుభవంలో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఒకవేళ నిజంగానే 2023లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీజేపీ నడిపించిన బండి సంజయ్ ని సీఎంను చేస్తుందా.? లేక సీనియర్ కిషన్ రెడ్డిని చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read: రామమందిరం కోసం విరాళాల సేకరణ.. ఎప్పటి నుంచి?
ఇప్పటికే కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా చేశాడు. ఆయన హయాంలో బీజేపీ పెద్దగా పురోగమించింది లేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి హవా నడవలేదు. అంతా బండి సంజయ్ ఆధిపత్యమే కొనసాగింది. పార్టీని దూకుడుగా నడపడంలో బండి సక్సెస్ అయ్యారు. ఆయన కోసం ఓ కార్యకర్త సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ అడ్డా అయినా కిషన్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు.
అదే సమయంలో బండి సంజయ్ దూకుడు, పార్టీని నడిపించి రెండు ఎన్నికల్లోనూ గెలిపించాడు. దీంతో మెజార్టీ వర్గాలు, యువత, యువ నాయకులు బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరుస్తుండగా.. సీనియర్లు అంతా కిషన్ రెడ్డి వైపు నిలుచున్నారు. దీంతో బీజేపీలో సీఎం లొల్లి మరోసారి పార్టీని రెండు చీల్చుతుందోమోనన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీలో అధిష్టానమే ఫైనల్ కావడంతో ఎవరూ సీఎం అవుతారన్నది వాళ్లే డిసైడ్ చేస్తారు. ఇక్కడి వారు శిరసావహించడం తప్పతే మరో ఆప్షన్ ఉండదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్