https://oktelugu.com/

‘శ్రీమంతుడి’గా మారిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ‘శ్రీమంతుడి’గా మారాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ మూవీలో గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నివిధలా ఆదుకుంటాడు. ఈ సినిమా టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ మూవీలో మాదిరిగానే సల్మాన్ భాయ్ రియల్ గా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అన్నివిధలా ఆదుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 2019 సంవత్సరంలో మహారాష్ట్రలో భారీ వరదలు సంభవించారు. కోల్హాపూర్ జిల్లాలోని ఖిద్రాపూర్ గ్రామం వరదలకు చాలావరకు దెబ్బతింది. ఈ […]

Written By: , Updated On : February 27, 2020 / 11:07 AM IST
Follow us on

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ‘శ్రీమంతుడి’గా మారాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ మూవీలో గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నివిధలా ఆదుకుంటాడు. ఈ సినిమా టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ మూవీలో మాదిరిగానే సల్మాన్ భాయ్ రియల్ గా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అన్నివిధలా ఆదుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

2019 సంవత్సరంలో మహారాష్ట్రలో భారీ వరదలు సంభవించారు. కోల్హాపూర్ జిల్లాలోని ఖిద్రాపూర్ గ్రామం వరదలకు చాలావరకు దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వారికి ఆదుకుంటానని ప్రకటించారు. ఎలాన్ ఫౌండేషన్ వారితో కలిసి సల్మాన్ ఖాన్ బాధితులకు ఇళ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నాడు. తమకు సల్మాన్ ఖాన్ మద్దతు లభించడంపై ఎలాన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవి కపూర్ హర్షం వ్యక్తం చేశారు.

సల్మాన్ ఖాన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడు ముందే ఉంటాడు. గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తన ఉదారతను చాటుకున్నాడు. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే, కబీ ఈద్ కబీ దివాళీ చిత్రాలతో బీజీగా ఉన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రాధే మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో సల్మాన్ కు జోడీ దిశా పటానీ నటిస్తుంది. రందీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు రానుంది.