దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకునేలా రాజమౌళి తీవ్రంగా కసరత్తు చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ ట్రెండ్స్ చూస్తుంటే ఈసారి అతడే విన్నర్?
ఇప్పటికే రాంచరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ ను చూపిస్తూ విడుదల చేసిన టీజర్ తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత కరోనా రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ కొమురంభీం గెటప్ ను చూపించలేకపోయారు.
ఇటీవలే కరోనా కట్టుబాట్లను తెంచుకొని ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే కొమురంభీంగా ఎన్టీఆర్ ను రాజమౌళి తీర్చిద్దారు.
అల్లురిగా రాంచరణ్ ను మొత్తం నిప్పుతో చెలగాటమాటే యోధుడిగా చూపించిన జక్కన్న ఆదిలాబాద్ అడువుల బిడ్డ కొమురంభీంను పూర్తి నీటి అలలపై చూపించాడు. ఎన్టీఆర్ ను సముద్రం ముందు నిలుంచడబెట్టి ఎగిసే అలలతో పోల్చాడు. ఒక శూలం లాంటి ఆయుధంతో ఎన్టీఆర్ పోరాట పటిమను చూపించాడు. ఆ తర్వాత నిజాం ప్రభువులతో పోరాటానికి సంబంధించిన సీన్, ఎన్టీఆర్ ధీరత్వం, పోరాటం ట్రైలర్ లో కనిపించింది. చివరకు ముస్లిం యువకుడిలా మారిన కొమురం భీం గా ట్విస్ట్ ఇచ్చారు. అంటే కొమురం భీం అజ్ఞాతంలో ఒక ముస్లింగా జీవించాడని తెలుస్తోంది.
Also Read: సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందా?.. జబర్ధస్త్, ఢీ షోల పరిస్థితేంటి?
అల్లూరి రాంచరణ్ కు పోటీగా వచ్చిన కొమురం భీం ఎన్టీఆర్ టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా అదే పంచ్ డైలాగులతో వరుసలో రాజమౌళి తీర్చిదిద్దారు. గూస్ బాంబ్స్ వచ్చేలా సీన్లు ఉన్నాయి. అయితే పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తారన్న సీన్లు మాత్రం ఇందులో కనిపించలేదు.