విజయవాడలోని దుర్గాగుడికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇటీవల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి క్యూలైన్లలో అధికారులు మార్పులు చేశారు. కొండ చరియలు మరి కొన్ని చోట్ల విరిగిపడే అవకాశం ఉన్నందున 100 డ్రమ్ముల్లో నీటిని నింపి పెట్టారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లలో మార్పులు చేసినట్లు వారు పేర్కొన్నారు.