
రేపు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజు కానుంది. దసరాగా కానుకగా అక్టోబర్ 22న ఉదయం 11గంటలకు ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Also Read: దారుణంగా బిగ్ బాస్ షో రేటింగ్స్.. షాక్ లో నిర్వాహకులు..?
గత నాలుగైదు రోజులు టీజర్ రిలీజు విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం కౌంట్ డౌన్ స్టాట్ చేసింది. దీంతో ఈ మూవీ టీజర్ పై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ వస్తోంది. ఈనేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ సంబంధించిన ఓ స్పెషల్ గ్లిమ్స్ తో ట్వీటర్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా తారక్-చెర్రీ మధ్య ట్వీటర్లో సరదా సంభాషణ్ జరిగింది. ‘తారక్ బ్రదర్.. నిన్ను టీజ్ చేసేలా ఓ స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేస్తున్న.. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి ‘రామరాజు ఫర్ బీమ్ విడుదల చేస్తా’ అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తారక్ సైతం తనదైన శైలిలో స్పందించాడు.
‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.. జక్కన్నతో డీలింగ్ అషామాషీ కాదు.. నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు.. ఏదైనా జరగొచ్చు.. ఏదిఏమైనా పూర్తి వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ తారక్ రిప్లయ్ ఇచ్చాడు. వీరిద్దరి సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: తమిళ రాకర్స్ పైరసీ వైబ్ సైట్ ‘ఆట’కట్టించిన అమేజాన్
ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతుండగా.. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన తొలి టీజర్లో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించాడు. దీంతో సెకండ్ టీజర్ ఎన్టీఆర్ ను జక్కన్న ఎలా చూపిస్తాడనే ఆసక్తి అందరికీ నెలకొంది. ఇక రేపటితో ఆ ఉత్కంఠ తెరపడటం ఖాయంగా కన్పిస్తోంది.
Broooo @AlwaysRamCharan .. I hope you realise you are already late by 5 months 😉
And beware, you are dealing with Jakkana @ssrajamouli ! Anything can happen!! 😂
Anyway, CANT WAIT and fully excited.. 😄#RamarajuForBheemTomorrow #RRRMovie https://t.co/26c60WeUsq
— Jr NTR (@tarak9999) October 21, 2020