ఏపీ సీఎం జగన్ మళ్లీ యుద్ధాన్ని స్ట్రాట్ చేశాడు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ, సీఎం జగన్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. నిమ్మగడ్డను జగన్ తొలగించడం.. ఆయన కోర్టుల ద్వారా మళ్లీ ఏపీ చీఫ్ ఎన్నికల కమిషనర్ గా కావడం పెద్ద కథే నడిచింది. ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్ బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
తాజాగా వివాదం ఏంటంటే.. ఈసారి ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ కు నిధులు ఇవ్వడం లేదని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఏపీ ఎన్నికల కమిషన్ కు జగన్ సర్కార్ రూపాయి ఇవ్వడం లేదట.. దీంతో ఎలా కొనసాగించాలని నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అడగకుండా హైకోర్టుకు ఎక్కి మరోసారి వివాదాన్ని రాజేశారు.
రాజ్యాంగంలోని 243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఈ పిటీషన్ లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ,పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటెరీలను నిమ్మగడ్డ పేర్కొన్నారు. విచారణను హైకోర్టు స్వీకరించింది.
Also Read: కోమా పార్టీకి రమణే దిక్కా! తెలంగాణ టీడీపీ దుస్థితిది!
ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేసిందని.. ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదని నిమ్మగడ్డ పిటీషన్ లో పేర్కొన్నారు. కోర్టు వెంటనే జోక్యం చేసుకొని నిధులు విడుదల అయ్యేలా చూడాలని కోరారు.