https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ప్రేయసిని చూపించిన రాజమౌళి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఒక్కో అప్ డేట్ విడుదలవుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన రాజమౌళి తాజాగా మరో అప్ డేట్ ను ఇచ్చారు. కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ప్రేయసిని అధికారికంగా ప్రకటించారు. ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2021 / 01:23 PM IST
    Follow us on

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఒక్కో అప్ డేట్ విడుదలవుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన రాజమౌళి తాజాగా మరో అప్ డేట్ ను ఇచ్చారు. కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ప్రేయసిని అధికారికంగా ప్రకటించారు. ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

    ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే రాంచరణ్ కు జోడిగా ఆలియా భట్ ను చూపించిన రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రేయసిని చూపించారు.

    ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ ను ప్రేక్షకులకు చూపించాడు రాజమౌళి. తారక్ ప్రేయసిగా ఒలీవియా నటిస్తోంది. శుక్రవారం ఒలీవియా పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

    తారక్ సైతం ఒలీవియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ జెన్నీఫర్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

    దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.