తెలంగాణ సర్కార్‌‌కు కొత్త సవాల్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌.. ఆయన లెక్కలు వేరు. ఆయన పాలనా వేరు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాల్నో కూడా బాగా తెలుసు. అందుకే.. రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు. ముఖ్యంగా రెండో సారి అధికారంలోకి రావడానికి రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ప్రస్తుతం రైతుల రుణమాఫీ ఏం అయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రేపోమాపో పథకం అమలును కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. Also Read: ఎప్పుడు.. ఎంత ప్రకటించాల్నో కేసీఆర్‌కు‌ […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 1:12 pm
Follow us on


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌.. ఆయన లెక్కలు వేరు. ఆయన పాలనా వేరు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాల్నో కూడా బాగా తెలుసు. అందుకే.. రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు. ముఖ్యంగా రెండో సారి అధికారంలోకి రావడానికి రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ప్రస్తుతం రైతుల రుణమాఫీ ఏం అయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రేపోమాపో పథకం అమలును కేసీఆర్ ప్రకటిస్తారన్నారు.

Also Read: ఎప్పుడు.. ఎంత ప్రకటించాల్నో కేసీఆర్‌కు‌ తెలుసట

నిరుద్యోగ భృతి పథకం కోసం నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు బడ్జెట్లలో దీని గురించి ప్రస్తావించలేదు. తర్వాత బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించనున్నట్లు కేటీఆర్ మాటల ద్వారా తెలుస్తోంది. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణలో నిరుద్యోగం రేటు ఎక్కువగానే ఉంది.

Also Read: కోమటిరెడ్డి టార్గెట్‌ అదే..? : అందుకే ఇలా చేస్తున్నారు

అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు ముందు పది జిల్లాల్లో దాదాపుగా పది లక్షల మంది నిరుద్యోగులున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడినా.. నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పదిహేను లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నిరుద్యోగి అనే ప్రామాణికమే కీలకం కానుంది. అర్హతలు నిర్ణయించే దాన్ని బట్టి.. లబ్ధిదారుల సంఖ్య పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అయితే.. లక్షల మందికి నెలకు జీతం ఇచ్చినట్లుగా రూ.3016 ఇవ్వడం సామాన్యమైన అంశం కాదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందికరమే. కానీ.. హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి. నిరుద్యోగ భృతినిని గతంలో చంద్రబాబు సర్కార్ అమలు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చి మళ్లీ.. ఎన్నికలకు కొంత ముందు ప్రారంభించడంతో రావాల్సిన మైలేజీ రాలేదు. ఈ విషయాన్ని కూడా తెలంగాణ సర్కార్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే నిరుద్యోగభృతిని నిరుద్యోగుల్లో అసంతృప్తి రాకుండా అమలు చేయడం కూడా పెద్ద సవాలే.