https://oktelugu.com/

కయ్యానికి దిగి సాధించిందేంది..?

రాజకీయాల్లో సక్సెస్‌ సాధించాలంటే.. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో’ కూడా తెలుసుకోవాలి. గెలిపించేది ప్రజలే అయినప్పటికీ..అంచనా వేసుకోవాల్సింది నాయకులే. అధికారంలో ఉన్నామని తాము ఎప్పుడూ నెగ్గాలనుకోవడం కూడా అహమే అవుతుంది. రాజకీయాల్లో అహం అనేది ఓటమికి తొలి మెట్టు. ఎలాంటి ఈగోలు లేని వ్యక్తులే.. రాజకీయాల్లో రాణిస్తారు. పూర్తిస్థాయిలో కాకపోయినా కనీసం కంట్రోల్ చేసుకోగలిగే మానసిక ధృడత్వం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎక్కడ తగ్గాలో తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బీజేపీతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 29, 2021 / 01:31 PM IST
    Follow us on


    రాజకీయాల్లో సక్సెస్‌ సాధించాలంటే.. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో’ కూడా తెలుసుకోవాలి. గెలిపించేది ప్రజలే అయినప్పటికీ..అంచనా వేసుకోవాల్సింది నాయకులే. అధికారంలో ఉన్నామని తాము ఎప్పుడూ నెగ్గాలనుకోవడం కూడా అహమే అవుతుంది. రాజకీయాల్లో అహం అనేది ఓటమికి తొలి మెట్టు. ఎలాంటి ఈగోలు లేని వ్యక్తులే.. రాజకీయాల్లో రాణిస్తారు. పూర్తిస్థాయిలో కాకపోయినా కనీసం కంట్రోల్ చేసుకోగలిగే మానసిక ధృడత్వం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎక్కడ తగ్గాలో తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బీజేపీతో సాన్నిహిత్యం కూడా చాలా తగ్గారు. తన స్వభావానికి విరుద్ధంగా పాద నమస్కారాలు కూడా చేశారు. చేయించారు.

    అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ‘తగ్గుదల’ కొనసాగిస్తున్నారు. కానీ.. ఆయన కాస్త తల పైకెత్తి చుట్టూ చూడటం మర్చిపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద తగ్గితే చాలు.. ఇంకా ఎవరిపైనైనా రెచ్చిపోవచ్చు అన్నట్లుగా ఆయన అర్థం చేసుకున్నారు. కానీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది లేదు. న్యాయవ్యవస్థతో లొల్లి పెట్టుకుని ఏం సాధించారు..? రాజ్యాంగ వ్యవస్థలతో గొడవలు పెట్టుకుని ఏం బావుకున్నారు..? ప్రజాస్వామ్యంలో పాలకులకే అధికారాలు ఉంటాయి. పాలకులు ఇప్పటివరకూ ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు.

    Also Read: పంచాయితీ వార్: జగన్ కు మరో షాకిచ్చిన నిమ్మగడ్డ

    స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏ రాష్ట్రంలో అయినా ఎవరి ప్రభుత్వ హయాంలో అయినా ప్రభుత్వానికి ఎదురు తిరగడం చూశామా..? చివరికి ఏపీలో కూడా మొదట్లో నిమ్మగడ్డ ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నారు. గందరగోళం జరిగినా లైట్ తీసుకున్నారు. చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టడంతో ఆయన మేలుకున్నారు. దీనంతటికి వైసీపీ ముఖ్య నేతలే కారణం. ఎన్నికల్లేకుండా గెలిచేసుకోవాలన్న తాపత్రయంతో దాడులు, దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకోవడంతో సమస్య వచ్చింది. ఆ తర్వాతైనా ఎస్‌ఈసీని కూల్ చేసే ప్రయత్నం చేశారా అంటే ఆయనతో గొడవలు పెట్టుకుంటూనే పోయారు.

    Also Read: అర్జంటుగా ఆ ఆఫీసర్లకు పోస్టింగులు..: ఏపీలో అసలేం జరుగుతోంది..?

    రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. తన అధికారాలపై స్పష్టమైన అవగాహన ఉన్న.. బ్యూరోక్రాట్‌ ఏం చేయగలరో.. అది శక్తివంచన లేకుండా చేయడానికి ప్రభుత్వం ఆయన్ని ప్రేరేపించింది. ఫలితంగా నిమ్మగడ్డను ఓ శత్రువుగా చేసుకుని ఆయన హయాంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వానికి ఎంత తప్పు చేశామో సులువుగానే అర్థమవుతోంది. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి తర్వాత ‘ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా..?’ అని బదిలీల విషయంలో వాదించిన ముఖ్యమంత్రి ఇప్పుడు.. రమేష్ కుమార్ చెప్పినట్లుగా చేయాల్సి వస్తోంది. ఎన్నికలు నిర్వహించబోమని సవాల్ చేసి నిర్వహించాల్సి వస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇగో తగ్గించుకుంటే మంచిదని చాలా కాలంగా ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. సుప్రీంకోర్టు కాస్త అటూ ఇటూగా ఇదే మాట చెప్పింది. వ్యవస్థల మధ్య ‘అహం’ కోసం జరుగుతున్న యుద్ధంలో తాము రాదల్చుకోలేదని స్పష్టం చేసింది. ఎన్నికలు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. తమకు ల్యాండ్ స్లైడ్ మ్యాండేట్ ఉందనేది జగన్ నిశ్చితాభిప్రాయం. మరి ఎందుకు ఆయన వెనక్కి తగ్గుతున్నారు. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగకూడదన్న ఒకే ఒక్క ‘అహం’తో ఆయన ఎన్నికలు వద్దంటున్నారు. ఒక వేళ ఎన్నికల ప్రక్రియ జరగకపోతే నిమ్మగడ్డ రిటైరై.. కొత్త ఎస్‌ఈసీని నియమించిన మరుక్షణం ఏపీలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సులువుగానే ఊహించవచ్చు. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తే ఏమవుతుంది? యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లో ఉంది. నిమ్మగడ్డ అంపైర్ లాంటి వారే. ఫలితాలను మార్చలేరు. కానీ.. ఆయన హయాంలో జరగకూడదనే పట్టుబట్టారు. రాజ్యాంగ ధిక్కరణకు సైతం పాల్పడ్డారు. చివరికి తల వంచక తప్పలేదు.