దేశమంతా కరోనా వైరస్ విపత్తు ఆవహించిన ప్రస్తుత పరిస్థితులలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై కొత్త అనుమానాలు వెల్లువెత్తు తున్నాయి.. ఆర్ ఆర్ ఆర్ భారీ చిత్రం కావడంతో వందల మంది సిబ్బంది దృశ్యాల చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నటులు మరియు సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది వేరు వేరు ప్రదేశాలకు చెందివారు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ నిర్వహించడం ఇబ్బందే .పొరబాటున చిత్ర బృందం లో ఎవరో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సజావుగా సాగే అవకాశం ఉండదు.
దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం ఉంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు తిరగడం నటులకు సైతం భయం కలిగించే విషయమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారీ షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వకపోవచ్చు.ఆ లెక్కన భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాను ఎలాగోలా చుట్టేసి విడుదల చేద్దాం అంటే కుదరదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా తెరకెక్కించినప్పుడే దాని అవుట్ ఫుట్ రిచ్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యల మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ అనుకున్న టైం కి పూర్తి కాడం అసాధ్యం అనిపిస్తోంది.
Prevention is better than cure