https://oktelugu.com/

మహేష్ ఫ్యామిలీ నుండి దూసుకొస్తున్న మరొక హీరో

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వెండి తేరా మీదకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రి తరహాలోనే సూపర్ స్టార్ స్థాయిని అందుకుని అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్నారు. ఘట్టమనేని కుటుంబం నుండి మహేష్ ఒక్కరే కాదు చాలామంది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మహేష్ బాబు కంటే ముందు ఆయన అన్న రమేష్ బాబు హీరోగా వచ్చి అలరించారు. అలాగే మహేష్ సోదరి మంజుల కూడ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ప్రతిభ చాటుకోగా ఆమె భర్త సంజయ్ స్వరూప్ […]

Written By: , Updated On : October 26, 2020 / 10:32 AM IST
Follow us on

Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వెండి తేరా మీదకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రి తరహాలోనే సూపర్ స్టార్ స్థాయిని అందుకుని అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్నారు. ఘట్టమనేని కుటుంబం నుండి మహేష్ ఒక్కరే కాదు చాలామంది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మహేష్ బాబు కంటే ముందు ఆయన అన్న రమేష్ బాబు హీరోగా వచ్చి అలరించారు. అలాగే మహేష్ సోదరి మంజుల కూడ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ప్రతిభ చాటుకోగా ఆమె భర్త సంజయ్ స్వరూప్ సైతం సహాయ నటుడిగా స్థిరపడ్డారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’: హీరోలతో రాజమౌళికి కత్తిమీద సామేనా?

ఇక కృష్ణగారి భార్య విజయ నిర్మల వైపు నుండి కూడ నటులు పరిశ్రమలోకి వచ్చారు. ఆమె కుమారుడు నరేష్ కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ఇప్పటికీ మంచి నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు సైతం హీరోగా సెటిల్ కాగా గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పుడు అదే కుటుంబం నుండి ఇంకో హీరో దూసుకొస్తున్నాడు.

Also Read: డ్రగ్స్ కొంటూ దొరికిన నటి.. షాక్ లో ఫ్యాన్స్..?

అతనే శరన్. విజయ నిర్మల సోదరుడి మనవడే ఈ శరన్. అంటే కృష్ణగారికి కూడ మనవడి వరసే అవుతాడు. ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న శరన్ హీరోగా రంగప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నాడు. రామచంద్ర వట్టికూటి అనే దర్శకుడి చిత్రంతో శరన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ పూర్తిచేసుకున్న శరన్ సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతున్నాడట. అంటే మహేష్ కుటుంబం నుండి ఇంకో హీరో వస్తున్నాడన్నమాట.