రోహిత్ సెంచరీ.. ఇంగ్లండ్ తో టెస్టులో నిలబడ్డ భారత్

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన టీమిండియా.. సొంత గడ్డపై మాత్రం తొలి టెస్టులో ఓడిపోయింది. ఇంగ్లండ్ ధాటికి కుప్పకూలి దారుణ పరాభావాన్ని ఎదుర్కొంది. దిగ్గజ ఆటగాళ్లు బరిలో ఉన్నా కూడా టీమిండియాకు ఓటమి ఎదురుకావడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ తో రెండో టెస్టులో తొలి అర్థం భాగం అదే కతా ఇండియా 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ డకౌట్ కానీ కెప్టెన్ కోహ్లీ సున్నా పరుగులకే ఔట్ […]

Written By: NARESH, Updated On : February 13, 2021 2:50 pm
Follow us on

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన టీమిండియా.. సొంత గడ్డపై మాత్రం తొలి టెస్టులో ఓడిపోయింది. ఇంగ్లండ్ ధాటికి కుప్పకూలి దారుణ పరాభావాన్ని ఎదుర్కొంది. దిగ్గజ ఆటగాళ్లు బరిలో ఉన్నా కూడా టీమిండియాకు ఓటమి ఎదురుకావడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.

ఈ క్రమంలోనే ఇంగ్లండ్ తో రెండో టెస్టులో తొలి అర్థం భాగం అదే కతా ఇండియా 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ డకౌట్ కానీ కెప్టెన్ కోహ్లీ సున్నా పరుగులకే ఔట్ అయ్యి అందరికీ షాకిచ్చాడు. ఓపెన్ గిల్ టీమిండియా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపడ్డాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్ ఆదుకున్నారు.

రెండో టెస్ట్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడుతు్నాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 130 బంతుల్లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు.

ఈ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించి వైస్ కెప్టెన్ ఆజింక్య రహానే నమ్మకాన్ని నిలబెట్టాడు. శుక్రవావరం జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ ఆటతీరుపై విమర్శలు చేసిన విలేకరుల తీరును రహానే తప్పు పట్టాడు. నాలుగైదు ఇన్నింగ్స్ లు చూసి ఆటగాడి సత్తాను అంచనా వేయేడం సరైంది కాదన్నారు. రోహిత్ నిలబడితే పరుగులు వాటంతట అవే వస్తాయన్నారు. రోహిత్ అద్భుతంగా ఆడగలడన్న నమ్మకం తమకు ఉందన్నారు.

అన్నట్టే రహానే నమ్మకాన్ని రోహిత్ నిలబెట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ధాటిగా ఆడుతూ సెంచరీ సాధించి అభిమానులకు ఆనందాన్నిచ్చాడు.

రోహిత్ శర్మకు తన టెస్ట్ కెరీర్లో ఇది వ సెంచరీ. ఈ 7 సెంచరీలు స్వదేశంలోనే చేయడం విశేషం. విదేశాల్లో రోహిత్ ఒక్క టెస్టులోనూ సెంచరీ చేయలేదు. మొత్తానికి టీ బ్రేక్ వరకు టీమిండియా రోహిత్ సెంచరీ వల్ల 192/3 పరుగులతో ఆడుతోంది.