గంటా.. జేడీ స్పెషల్‌ భేటీ : అందుకేనట..?

ఒకాయన మాజీ మంత్రి.. ఇంకో ఆయన సీబీఐ మాజీ జేడీ. వారిద్దరి భేటీ ఇప్పుడు చర్చకు దారితీసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిశారు. విశాఖలో శుక్రవారం ఈ ఇద్దరు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. భేటీ తర్వాత మాట్లాడిన ఆయన.. కేంద్రం సెంటిమెంట్‌ను గుర్తించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. […]

Written By: Srinivas, Updated On : February 13, 2021 2:25 pm
Follow us on


ఒకాయన మాజీ మంత్రి.. ఇంకో ఆయన సీబీఐ మాజీ జేడీ. వారిద్దరి భేటీ ఇప్పుడు చర్చకు దారితీసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిశారు. విశాఖలో శుక్రవారం ఈ ఇద్దరు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. భేటీ తర్వాత మాట్లాడిన ఆయన.. కేంద్రం సెంటిమెంట్‌ను గుర్తించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆ సహనం వెనుక మతలబేంటి..? : డ్యామేజీ తప్ప ఇమేజీ వస్తుందా..!

సీఎం జగన్ చొరవ చూపి ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలన్నారు. పార్టీలకతీతంగా పోరాడితేనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఉధృతమవుతోంది. పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా ఎమ్మెల్యే ఇప్పటికే పదవికి రాజీనామా చేశారు. గంటా రాజీనామాపై విమర్శలు రావడంతో.. శుక్రవారం గంటా శ్రీనివాసరావు మరోసారి తన పదవికి రాజీనామా చేశారు.

Also Read: పంచాయతీ ఎన్నికల్లో పార్టీల బలనిరూపణ

అది స్పీకర్‌ ఫార్మాట్‌లో లేదని ఆరోపణలు రావడంతో శుక్రవారం మరోసారి ఏకవాక్యంతో తన రాజీనామా సమర్పించారు. ఉక్కు ఉద్యమాన్ని స్పీడు పెంచే పనిలో ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం లేపాలని ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే విశాఖ స్టీల్‌ ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్